War 2 Vs Coolie Trailers: బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ వెయిటెడ్ చిత్రాలుగా నిలిచిన చిత్రాలలో రజనీకాంత్ (Rajinikanth ) కూలీ (Coolie) చిత్రంతోపాటు హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR) కాంబోలో వస్తున్న వార్ 2 (War 2) చిత్రాలు నిలిచాయి. హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ రా ఏజెంట్గా నటిస్తూ బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేస్తున్న వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతోంది. ఇక అదే రోజున ఈ సినిమాకు పోటీగా లోకేష్ కనగరాజు (Lokesh kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా కూడా విడుదల కాబోతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయని తెలియడంతో.. బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ అప్పుడే అంచనాలు వేస్తున్నారు.
వార్ 2 ట్రైలర్ విడుదల డేట్ లాక్..
ఇకపోతే ఇలాంటి సమయంలో ఇప్పుడు సరిగ్గా వారం తేడాతో ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ట్రైలర్స్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం వార్ 2. ఈ చిత్ర ట్రైలర్ కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 నిమిషాల 39 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ ట్రైలర్ ను వచ్చేవారం అనగా జూలై 23న ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకురాబోతున్నట్లు సమాచారం. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆగస్టు 14వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది ఈ చిత్రం. YRF స్పై యూనివర్స్ లో ఆరో చిత్రంగా ఈ సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.
కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న కూలీ సినిమాకి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, రజనీకాంత్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో ఇప్పటికే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయబోతున్నట్లు డైరెక్టర్ లోకేష్ కనగరాజు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సినిమా కూడా ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతోంది.
వారం తేడాతో ట్రైలర్ డేట్స్ లాక్..
ఇకపోతే వారం తేడాతో ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. మరి ట్రైలర్స్ తో ఏ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలియాలి . ఇక ఈ ట్రైలర్స్ సృష్టించే సంచలనమే.. ఆగస్టు 14న విడుదలయ్యే సినిమా ఫలితాల పైన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయి. ఏ సినిమా పై చేయి సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
ALSO READ:Shahrukh Khan: గాయపడ్డ హీరో షారుఖ్ ఖాన్.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!