Gun Fire on Singer : ఈమధ్య కాలంలో కొంతమంది దుండగులు సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని చేస్తున్న పనులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకరేమో నేరుగా సెలబ్రిటీల ఇళ్లల్లోకి దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇంకొకరేమో సెలబ్రిటీల ఇళ్లలో బాంబులు పెట్టామని బెదిరిస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా కాల్పులు జరిపి చంపేస్తామని బెదిరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. సెలబ్రిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు ఏం జరిగింది ?అనే విషయాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
మొన్నామధ్య సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనానికి కొంతమంది దుండగులు పాల్పడ్డారు. ఇక గత కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీలపై బాంబు బెదిరింపులు వెలువడుతున్నాయి. మరొకవైపు ఇప్పుడు ఒక స్టార్ సింగర్ పై కాల్పులు జరపడమే కాకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారట. మరి ఆ స్టార్ సింగర్ ఎవరు? ఆయనపై కాల్పులు జరిపి.. హత్య బెదిరింపులకు పాల్పడడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం
అసలు విషయంలోకెళితే.. కెనడాలో ప్రముఖ పంజాబీ గాయకుడిగా పేరు సొంతం చేసుకున్న తేజీ కహ్లాన్ పై కాల్పులు జరిగాయి. గ్యాంగ్ స్టార్ రోహిత్ గొదారాకు చెందిన ముఠా.. ఈ దాడికి బాధ్యత వహించినట్లు సమాచారం. ప్రత్యర్థి ముఠాలకు ఆయుధాలు , డబ్బు సరఫరా చేసి.. ఇన్ ఫార్మర్ గా పనిచేసినందుకు కహ్లాన్ ను టార్గెట్ గా చేసుకొని కాల్పులు జరిపినట్లు ఆ ముఠా బహిరంగంగా ప్రకటించింది. ప్రస్తుతం కహ్లాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒకవేళ చెప్పిన మాట వినకుండా దీనినే పునరావృతం చేస్తే కచ్చితంగా చంపేస్తామని గ్యాంగ్ స్టార్ బృందం బెదిరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈ ముఠాకు చెందిన మహేందర్ సరన్ దిలానా, రాహుల్ రీనౌ, విక్కీ ఫల్వాన్ అనే వ్యక్తులు సోషల్ మీడియా పోస్టులో మాట్లాడుతూ.. ప్రత్యర్థి ముఠాలకు ఆయుధాలు, డబ్బు సరఫరా చేయడం, ఇన్ ఫార్మర్ గా వ్యవహరించడం వంటి ఆరోపణలతో కహ్లాన్ ను లక్ష్యంగా చేయడం జరిగింది. మేము కెనడాలోని కహ్లాన్ పై కాల్పులు జరిపాము. ప్రస్తుతం అతడు కడుపులో కాల్పులు జరిపాము అతను అర్థం చేసుకుంటే సరే లేకపోతే అంతం చేస్తాము అంటూ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఇదిలా ఉండగా ఈ దుండగులు ఈనెల ప్రారంభంలో రాజస్థాన్లోని కుచమన్ పట్టణంలో జిమ్ములో వ్యాయామం చేస్తుండగా 40 ఏళ్ల వ్యాపారవేత్త రమేష్ రులానియా ని కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దుండగుడు ఉదయం 5:20 గంటల ప్రాంతంలో జిమ్ లోకి ప్రవేశించి అతి దగ్గరగా కాల్చి చంపి పారిపోయారు. దాడికి కొద్దిసేపటికి ముందు సాయుదుడు ఆవరణలోకి ప్రవేశించడం అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది.
ALSO READ:Bigg Boss: TVR రేటింగ్ లో బిగ్ బాస్ కి ఏ భాషలో ఏ స్థానం అంటే?