BigTV English

Vash level 2: ఓటీటీలోకి వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?

Vash level 2: ఓటీటీలోకి వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Vash level 2: సాధారణంగా థియేటర్లలో విడుదలైన చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తాయి. అయితే ఆ ఓటీటీలలో ఇప్పుడు ఎక్కువగా కామెడీ, హారర్ , ఎమోషనల్ , ఫ్యామిలీ, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ప్రతి జానర్ లో కూడా సినిమాలను అభిమానుల కోసం తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో వెన్నులో వణుకు పుట్టించిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. మరి ఆ హారర్ థ్రిల్లర్ ఏంటి? దానిని ఎప్పుడు చూడవచ్చు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..


స్ట్రీమింగ్ కి వచ్చేసిన వాష్ లెవెల్ 2..

గత రెండు నెలల క్రితమే థియేటర్లలో విడుదలై.. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన హార్రర్ థ్రిల్లర్ చిత్రం వాష్ లెవెల్ 2. రెగ్యులర్ గా వినే , చదివే టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు లాగా కాకుండా ఇది ఒక గుజరాతీ చిత్రం కావడం గమనార్హం. 2023లో ఒక మామూలు గుజరాతీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన వాష్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ మొదటి భాగాన్ని మించి విజయం సాధించింది.. థియేటర్లలోకి వచ్చిన ఇన్నాళ్లకు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా.. హిందీతో పాటు గుజరాతి భాషలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కృష్ణదేవ్ యఘ్నిక్ దర్శకత్వం వహించారు. భయానక దృశ్యాలు, బ్లాక్ మ్యాజిక్ అంశాలతో కూడిన ఈ చిత్రంలో సూపర్ నాచురల్ సస్పెన్స్, సైకాలజికల్ అంశాలను చాలా బలంగా చూపించారు.ఇకపోతే ఈ సినిమా మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ తో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక కాంబినేషన్లో బాలీవుడ్ లో సైతాన్ అంటూ ఒక మూవీని తెరకెక్కించారు.

వాష్ లెవెల్ 2 స్టోరీ..

సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఒక స్కూల్ కి వెళ్ళిన విద్యార్థినిలు మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో ఉన్నఫలంగా బిల్డింగ్ టవర్స్ పైకెక్కి 7, 8 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ తర్వాత కొంతమంది విద్యార్థులు, పనిచేసేవారు సైతం వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొద్ది సమయంలోనే పోలీసులకు, మీడియాకు విషయం తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనం అవుతుంది. అదే సమయంలో మంచానికే పరిమితమైన తన కూతురు ఆర్యతో కలిసి సిటీకి దూరంగా ఉంటున్న అధర్వకు ఈ విషయం తెలిసి షాక్ అవుతాడు. ఇక తన కూతురు సమస్యకు కారణమైన వశీకరణ మాదిరే స్కూల్లో జరుగుతోందని భావించి అక్కడకు వెళ్తారు. ఇకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత రాజ్ నాథ్ అనే వ్యక్తి ఆ స్కూల్ విద్యార్థులను వశీకరణ చేసి నగరంలోకి పంపించినట్లు తెలుసుకుంటారు. ఇక సిటీలోకి వెళ్లిన విద్యార్థులు రాక్షసులుగా ప్రవర్తించి కనిపించిన వారిని ఇష్టం వచ్చినట్లు చంపేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే హీరో అధర్వ ఏం చేశాడ స్కూల్లో, నగరంలో జరిగిన బీభత్సాన్ని ఎలా అదుపులోకి తీసుకొచ్చారు? రాజ్నాథ్ ఎందుకు ఈ బ్లాక్ మ్యాజిక్ కి పాల్పడ్డారు? ఇలా ప్రతి అంశంతో ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి రావడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ALSO READ: Bill Gates Acting : యాక్టింగ్ ఫీల్డ్‌లోకి బిల్ గేట్స్…సీరియల్‌లో నటించబోతున్న ప్రపంచ సంపన్నుడు.!

Related News

OTT Movie : 300 కోట్ల దోపిడీ… బిగ్గెస్ట్ రియల్ లైఫ్ దొంగతనం… ‘మనీ హీస్ట్’లాంటి కేక పెట్టించే థ్రిల్లర్

Dude OTT : ‘డ్యూడ్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movie : ఏం సీన్లు గురూ… చలికాలంలోనూ చెమటలు పట్టించే స్టోరీ… పెద్దలకు మాత్రమే మావా

OTT Movie : హైస్కూల్ అమ్మాయిల వెంటపడే పిశాచి… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే

OTT Movie : ఎనిమీతోనే బెడ్ షేర్ చేసుకునే అరాచకం… అల్టిమేట్ డేర్… ట్విస్టులతో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఆ రూమ్ లోకి అడుగు పెడితే రెచ్చిపోయే అమ్మాయిలు… ప్రాణాంతకమైన ఉచ్చులోకి లాగే మిస్టరీ… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : నెక్స్ట్ డోర్ క్రైమ్స్… ప్రతీ మర్డర్ కేసులో ఊహించని టర్నులు, ట్విస్టులు… నరాలు తెగే ఉత్కంఠ

Big Stories

×