Anasuya Bharadwaj : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్ లో చాలామందికి విపరీతమైన గుర్తింపు వస్తుంది. అయితే వాళ్లందరూ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు పాత సినిమాలు చూస్తున్నప్పుడు ఈ నటులే అప్పుడు కూడా తలుక్కుమంటారు. అక్కడితో వీళ్లు అప్పటినుండి ఇండస్ట్రీలో ఉన్నారా అని మనకి ఒక క్లారిటీ వస్తుంది.
అలా ఎప్పుడో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసిన అనసూయ జబర్దస్త్ అనే షో ద్వారా బాగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూ చేయటం. అలానే ప్రాముఖ్యత ఉన్న పాత్రులను ఎంచుకొని నటించడం వలన అనసూయ బాగా పాపులర్ అయిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయ కెరియర్ కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. రంగమ్మత్త అనే పాత్ర తెలుగు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతుంది.
వాళ్లు నన్ను గుర్తించలేదు
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఏకంగా అల్లు అర్జున్ కు ఈ సినిమా పరంగా నేషనల్ అవార్డు కూడా లభించింది. అయితే ఈ సినిమాలో దాక్షాయిని అనే పాత్రలో కనిపించింది అనసూయ. అయితే అనసూయ దాక్షాయిని పాత్రలో నటించినట్లు నార్త్ పీపుల్ ఎవరు గుర్తుపట్టలేదు అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే వాళ్లు గుర్తుపట్టకపోవడానికి పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జబర్దస్త్ అనే షో తెలుగులో మాత్రమే పరిచయం. అలానే అనసూయ చేసిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో పెద్దగా గుర్తింపు సాధించలేదు. పుష్ప మొదటి సినిమా కాబట్టి నార్త్ వాళ్ళు దాక్షాయిని పాత్రలో నటించింది అని అనసూయను గుర్తించకపోవచ్చు.
అవకాశం ఎలా వచ్చింది అంటే
కార్తీక్ గుమ్మకొండ నటించిన చావు కబురు చల్లగా అనే సినిమా లో అనసూయ నటించింది. ఆ ఈవెంట్ కి వచ్చినప్పుడు అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ.. మామూలుగా మెగా హీరోస్ అందరితోనూ నేను సినిమాలు చేశాను. మీతో బ్యాలెన్స్ ఉంది అని క్యాజువల్ గా మాట్లాడింది. బహుశా యాదృచ్ఛికంగా వీరిద్దరూ కలిసి పుష్ప సినిమాలో పనిచేశారు. తరచు సినిమాల్లో కనిపించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు అనసూయ. రీసెంట్ గానే సైబర్ నేరగాలు వలన ఆమె ఎదుర్కొన్న నష్టాన్ని కూడా నెటిజెన్స్ కి తెలిపారు.
Also Read : Anasuya Bharadwaj : అనసూయకి కండిషన్ పెట్టిన బుచ్చిబాబు, అలా పిలవమని చెప్పేవాడట