BigTV English

Kajol -Twinkle : టూ మచ్ అంటోన్న కాజల్ .. ట్వింకిల్… సరికొత్త షో ప్రారంభం?

Kajol -Twinkle : టూ మచ్ అంటోన్న కాజల్ .. ట్వింకిల్… సరికొత్త షో ప్రారంభం?

Kajol – Twinkle: ఒకప్పుడు ఏదైనా ఒక షో ప్రారంభం కావాలి అంటే కేవలం బుల్లితెరపై మాత్రమే సరికొత్త షోలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేసేవి కానీ ఇటీవల కాలంలో ఓటీటీ(OTT) లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో టాక్ షోలు(Talk Shows) ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు హోస్ట్ లుగా మారి ఇలాంటి టాక్  షోలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol), ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna)  వ్యాఖ్యాతలుగా సరికొత్త షో ప్రారంభం కాబోతోంది.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.


అతిథులుగా బాలీవుడ్ స్టార్స్..

కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్టులుగా అమెజాన్ ప్రైమ్ లో “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్‌” (Too Much with Kojal and Twinkle)అనే షో ప్రారంభం కాబోతోంది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ విషయమైనా ఎంతో ముక్కుసూటిగా సమాధానాలు చెప్పబోతున్నారని తెలుస్తోంది .ఎలాంటి దాపరికాలు లేకుండా నిజాయితీగా నిర్భయంగా సమాధానాలను రాబట్టడమే ఈ షో ప్రధాన ఉద్దేశం అని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ సెలబ్రిటీలు అయిన, అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.


ఇద్దరూ హోస్టులతో మొదటి షో..

ఇప్పటికే ఈ విధమైనటువంటి ఎన్నో టాక్ షోలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఇద్దరు హోస్టులతో ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రాలేదని చెప్పాలి మొదటిసారి ఇద్దరు హోస్టులకు ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుంది. ఇక ఈ కార్యక్రమాన్ని బనిజయ్ ఆసియా నిర్మించబోతున్నారు. బోల్డ్, బ్రిలియంట్, అన్‌ఫిల్టర్డ్ గా రాబోతున్న ఈ కార్యక్రమం కచ్చితంగా ప్రేక్షకులలో మంచి అంచనాలను నింపడమే కాకుండా ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుందని తెలియజేశారు.

ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో కాఫీ విత్ కరణ్, కపిల్ శర్మ టాక్ షో ఎంతగానో ఫేమస్ అయ్యాయి. ఇదే తరహాలో టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ కార్యక్రమం కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక తెలుగులో కూడా బాలకృష్ణ హోస్ట్ అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే కార్యక్రమం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోలో ప్రసారం కాబోతుంది అయితే మొదటి అతిధిగా ఎవరు రాబోతున్నారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: Rana Daggubati: బెట్టింగ్ యాప్స్ విచారణకు హీరో రానా డుమ్మా? సారీ అంటూ

Related News

OTT Movie : స్టార్ హీరోలెవ్వరూ చేయని సాహసాలు… హర్రర్ నుంచి సస్పెన్స్ దాకా మమ్ముట్టి కెరీర్ బెస్ట్ మూవీస్ ఇవే

OTT Movie : ఆడవాళ్లందరినీ వదిలేసి బొమ్మతో… చివరికి ఆ పని కూడా దాంతోనే… ఊహించని ట్విస్టులున్న థ్రిల్లర్ మూవీ

OTT Movie : ఈ అమ్మాయిని ప్రేమిస్తే కుక్క చావే… మగవాళ్ళను దగ్గరకు రానివ్వని దెయ్యం… గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ

OTT Movie : క్షుద్ర పూజలతో మేల్కొలుపు… అంతులేని ఆకలున్న దెయ్యం ఇది… కామెడీతో కితకితలు పెట్టే తెలుగు హర్రర్ మూవీ

Chiranjeevi : భారీ ధరకు అమ్ముడుపోయిన మెగా 157 ఓటీటీ హక్కులు.. అక్కడే స్ట్రీమింగ్!

Telugu Web Series: ప్రేమలో తొందరపాటు.. ప్రియుడిని ముక్కలు చేసి డ్రమ్ములో వేసే ప్రియురాలు, కొత్త సీరిస్ సిద్ధం

Big Stories

×