Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందు కొన్ని సినిమాల్లో నటిగా కనిపించి, ఆ తర్వాత యాంకర్ గా కూడా పనిచేసే చేసి, జబర్దస్త్ షో తో మంచి గుర్తింపును సాధించుకుంది. అయితే జబర్దస్త్ షో చేస్తున్న తరుణంలోని కొన్ని సినిమా అవకాశాలను పొందుకొని గుర్తింపు ఉన్న పాత్రలను చేసింది.
అనసూయ ఎన్ని పాత్రలు చేసినా కూడా అనసూయ కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాత్ర మాత్రం రంగస్థలం సినిమాలో రంగమ్మత్త. రంగస్థలం సినిమాతో అనసూయ కి మంచి బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. సుకుమార్ ఈ పాత్రను డిజైన్ చేసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. రామ్ చరణ్ అనసూయ మధ్య ఉన్న బాండింగ్ అద్భుతంగా ఈ సినిమాలో వర్కౌట్ అయిందని చెప్పొచ్చు.
అనసూయ కు కండిషన్
రంగస్థలం సినిమాకు సంబంధించి దాదాపు 20,30 మందిని రంగమ్మత్త పాత్ర కోసం ఆడిషన్ చేశారట. అయితే అనసూయ కూడా ఆడిషన్ ఇచ్చారు. ఆమె ఆడిషన్ ఇచ్చిన మూడు నెలల తర్వాత అనసూయకు ఫోన్ చేసి డేట్స్ చెప్పారట. సుకుమార్ అప్పటికి క్షణం సినిమా కూడా చూడలేదు. సుకుమార్ దగ్గర దర్శకుడు బుచ్చిబాబు, కాశీ , శ్రీనివాస్ అనే ముగ్గురు రైటర్లు ఉండేవాళ్ళు. వాళ్లంతా కూడా ఒకరినొకరు మాయా అని పిలుచుకునే వాళ్ళు. అలానే ప్రస్తుత పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు కూడా… అనసూయతో ‘బుచ్చి మాయా’ అని పిలిపించుకునేవారు. అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది అనసూయ.
జబర్దస్త్ కు దూరం
ముందుగా కొన్ని సినిమాల్లో కనిపించినా కూడా జబర్దస్త్ షో అనసూయకు విపరీతమైన పేరు తీసుకొచ్చింది. ఆ షో లో అనసూయ మీద కూడా కొన్ని జోకులు వేయటం వలన గట్టిగా పేలాయి. కేవలం అనసూయ మాత్రమే కాకుండా ఆ షో ద్వారా చాలామంది మంచి పేరు సాధించుకున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమెడియన్స్ గా చాలామంది సర్వైవ్ అవుతున్నారు. ఇక సినిమాలలో పూర్తిగా బిజీ అయిపోయిన తర్వాత జబర్దస్త్ కు దూరం అయిపోయారు. అప్పుడప్పుడు కొన్ని రియాల్టీ షోస్ లో అనసూయ కనిపిస్తూ ఉంటారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు అప్లోడ్ చేస్తూ కుర్రకారుని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు.
Also Read: Kingdom: కింగ్డమ్ ప్రమోషన్ కోసం సంచలన దర్శకుడు, వంశీ గట్టిగానే ప్లాన్ చేశాడు