Nellore: నేటి సమాజంలో రోజుకోజుకి చోరీలు ఎక్కువైపోతున్నాయి. అయితే బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను దొంగిలిస్తుంటారు కొందరు దొంగలు. రాత్రుళ్లు ఇళ్లలోకి చొరబడి దొపిడీకి పాల్పడుతుంటారు… కొందరు పట్టపగలే జేబులోని పర్సులు, మెడలోని బంగారు ఆభరణాలు కాజేస్తుంటారు. బైక్, కారు వంటి వాహనాలు దొంగిలించేవారు ఉన్నారు. ఇలాంటి దొంగతనాల గురించి నిత్యం వింటుంటాం… కానీ కొందరు చాలా విచిత్రమైన దొంగతనాలకు పాల్పడుతుంటారు. అలాంటిదే గత రాత్రి నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది.
అర్థరాత్రి బస్సు దొంగతనం..
నెల్లూరు జిల్లాలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. ఏకంగా 60 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. అదృష్టశావత్తు ఆ సమయంలో ఎదురుగా ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా ఆర్టీసీలో బస్సు మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది. సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్ద బస్సును గుర్తించిన పోలీసులు అక్కడ స్వాధీనం చేసుకున్నారు. బస్సు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు.
రాత్రకి రాత్రే మాయం..
శ్రీ పొట్టి శ్రీరాములు ఆర్టీసీ బస్టాండులో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నైట్ హాల్ట్ చేసింది. ప్రయాణికులు దించేశాక బస్సును బస్టాండ్‌లో పార్క్ చేసి డ్రైవర్, కండక్టర్ రెస్ట్ రూంలో పడుకున్నారు. ఉదయాన్నే డిపో నుంచి తీసేందుకు డ్రైవర్ కండక్టర్ పరిశీలించగా అక్కడ బస్సు కనిపించలేదు. కంగారు పడ్డ ఆ బస్సు డ్రైవర్, కండక్టర్లు.. అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లేదు. దాంతో పోలీసులను అలర్ట్ చేశారు.
Also Read: ఏపీ లిక్కర్ స్కాం నెక్స్ట్ అరెస్ట్ అతనేనా?
దొరికిన దొంగ..
ఈ క్రమంలో బస్సు బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా దాటినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్ద పోలీసులు, స్థానికుల సహాయంతో బస్సును ఆపారు. బస్సు నడిపిన వ్యక్తికి మతి స్థిమితం లేదని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. బస్సు నడిపిన వ్యక్తి పేరు బిట్రగుంట కృష్ణ. విడవలూరు మండలం కంచర్లపాలెం వ్యక్తిగా గుర్తించారు. ఏకంగా ఆర్టిసి బస్సునే దొంగిలించిన ఘటనపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ”ఆర్టిసి బస్సులో దొంగతనాల గురించి చూశాం… కానీ ఆర్టిసి బస్సునే దొంగిలించడం ఏంట్రా బాబు’ అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన దొంగ..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సును ఎత్తుకెళ్లిన దొంగ
ఏఎస్ పేట నుంచి నెల్లూరు బస్టాండ్ కు వచ్చిన బస్సు
బస్సును పార్క్ చేసి రెస్ట్ రూమ్ లో నిద్రపోయిన ఆర్టీసీ డ్రైవర్
తెల్లారేసరికి బస్సు మాయం
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా… pic.twitter.com/9nGZHPFPJK
— BIG TV Breaking News (@bigtvtelugu) July 24, 2025