BigTV English

Ntr Dragon: తారక్‌కు క్లైమాక్స్ ఇచ్చేశాడు… నీల్ మావా ప్లాన్ మామూలుగా లేదుగా

Ntr Dragon: తారక్‌కు క్లైమాక్స్ ఇచ్చేశాడు… నీల్ మావా ప్లాన్ మామూలుగా లేదుగా

Ntr Dragon: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక భారీ బడ్జెట్, లేదంటే పెద్ద హీరో సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినిమా 1000 కోట్లు మార్కెట్ ను దాటేసింది.


ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ప్రస్తుతం వాళ్ల సినిమాలు వస్తున్నాయి అంటే దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వార్ 2 సినిమాతో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు తారక్.

తారక్ కు క్లైమాక్స్ ఇచ్చేసాడు 


ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేజీఎఫ్ సినిమాతో ప్రభంజనాన్ని సృష్టించాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన పార్ట్-2 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక ప్రభాస్ కు సలార్ రూపంలో మంచి హిట్ అందించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమాను చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ డ్రాగన్ 30 డేస్ షూట్ అయ్యింది. క్లైమాక్స్, ఇంట్రడక్షన్ షూట్ చేశారు. ఆగష్టు 20 తరువాత WAR2 ప్రమోషన్స్ అయ్యాకా మళ్ళీ డేట్స్ ఇవ్వనున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ నవంబర్/డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చెయ్యాలని ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు.

రాజమౌళి రీవీల్ చేశారు 

ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. అయితే ఒక తరుణంలో ఎస్ఎస్ రాజమౌళి జపాన్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు తాను ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న సినిమాలలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా ఒకటి అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పేసాడు. అక్కడితో సినిమా టైటిల్ ఇదే అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే దేవర 2 సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నట్లు విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.

Also Read: Lokesh Kanagaraj: నటుడుగా లోకేష్ కనగరాజ్, అందుకే ఇన్ని గెటప్స్

Related News

OG Twitter Review: ఓజి ట్విట్టర్ రివ్యూ, హిట్ కొట్టేసినట్లేనా?

OG Film: ఓజీ కోసం పవన్ రెమ్యూనరేషన్..ఎవరికి ఎంతంటే?

OG premiers: నైజాం అంటే పవన్ అడ్డా… అన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఓజీ

OG Sujeeth : సుజీత్ సినిమాటికి యూనివర్స్, చివరగా ఫ్యాన్స్ కు మరో హై

 Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్..కీలక అప్డేట్ ఇచ్చిన నాగ వంశీ!

Arjun Das : అర్జున్ దాస్ ఎమోషనల్ పోస్ట్, పవన్ కళ్యాణ్ ఏ మత్తు మందు పెట్టాడో?

OG Movie: ఓజీ సినిమా ప్రమోషన్స్..చిక్కుల్లో పడ్డ జగతి ఆంటీ..మరి ఇంత దారుణమా!

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?

Big Stories

×