Lokesh Kanagaraj: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో మోస్ట్ హ్యాండ్సం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తను ఇప్పటివరకు తీసిన ఐదు సినిమాలకు విపరీతమైన పేరును సాధించాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. లోకేష్ కనగరాజ్ బయట కనిపించిన కూడా చాలామందిని అట్రాక్ట్ చేసేలా ఉంటాడు. లాంగ్ హెయిర్ తో షర్ట్ కు ఉన్న రెండు గుండెలు తీసి స్టైలిష్ గా నడుస్తూ ఉంటాడు.
లోకేష్ ఇదివరకే శృతిహాసన్ తో కలిసి ఒక సాంగ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూలో లోకేష్ పలు రకాల గెటప్స్ లో కనిపిస్తున్నారు. అసలు లోకేష్ కనకరాజ్ అలా కనిపించడానికి కారణం ఏమిటో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు..
నటుడిగా లోకేష్ కనగరాజ్
శృతిహాసన్ (Shruti Hassan) తో చేసిన వీడియో కాకుండా, అరుణ్ మాథెశ్వరన్ సినిమాలో లోకేష్ క నాగరాజ్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం లోకేష్ లాంగ్ హెయిర్ పెంచాడు. చాలా ఈవెంట్స్ లో లాంగ్ హెయిర్ తోనే కనిపించాడు లోకేష్. ఎక్కువ శాతం లాంగ్ హెయిర్ ఉంచుతాడు. అయితే రీసెంట్ టైమ్స్ లో లాంగ్ హెయిర్ కాకుండా అది కొంచెం షార్ట్ గా కనిపిస్తుంది. అలానే ఎప్పుడు లేని విధంగా గడ్డం కూడా పెంచాడు. అరుణ్ మాథెశ్వరన్ తన సినిమాకు సంబంధించి లోకేష్ కు ఒక త్రీ మంత్స్ వరకు హెయిర్ కట్ చేయద్దని చెప్పారట. అయితే కూలీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొంతమేరకు తాను ఇలా కట్ చేసి ఇంటర్వ్యూస్ లో హాజరవుతున్నాను అంటూ తెలిపాడు లోకేష్.
భారీ హైప్ కూలీ
ఇక లోకేష్ దర్శకత్వంలో వస్తున్న కూలి సినిమా మీద ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. కేరళలో ఈ సినిమా టికెట్స్ కోసం ఆడియన్స్ పరుగులు తీస్తున్నారు. అలానే ఆన్లైన్లో కూడా విపరీతమైన టికెట్లు సేల్ అవుతూ ప్రభంజనం సృష్టిస్తుంది. దాదాపు మొదటిరోజు 100 కోట్లు పైగా కలెక్షన్లు వచ్చిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. రజనీకాంత్ తో పాటు మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించిన భారీ హైప్ ఏర్పడింది. అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే అనిరుద్ అందించిన మ్యూజిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. కేవలం తమిళ్ సినిమాకు మాత్రమే అనిరుద్ ఇలా పనిచేస్తాడు అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి.
Also Read: Samantha: నా కొత్త సినిమా ఆగిపోలేదు, షూటింగ్ అప్పుడే మొదలవుతుంది