E-Paper
Advertisement

‘గాడ్ ఆఫ్ వార్’ తో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్కెచ్.. కోలీవుడ్ డైరెక్టర్‌కు నో ఛాన్స్?

‘గాడ్ ఆఫ్ వార్’ తో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్కెచ్.. కోలీవుడ్ డైరెక్టర్‌కు నో ఛాన్స్?
Advertisement

NTR Nelson: టాలీవుడ్ గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కన్నడ బ్యూటీ, నేషనల్ క్రష్ రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాలో పలు రికార్డులని కొల్లగొట్టగా, వచ్చే ఏడాది అనగా 2027 జూన్ 11వ తేదీన ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా  అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని క్రేజీ లీకులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్

Advertisement

ముఖ్యంగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నట్లు గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. బీస్ట్, జైలర్ చిత్రాలతో సౌత్ ఇండియాలోనే టాప్ కమర్షియల్ డైరెక్టర్‌గా ఎదిగిన నెల్సన్, ఎన్టీఆర్ కోసం తన మార్క్ డార్క్ కామెడీ మిక్స్ అయిన ఒక డిఫరెంట్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఏకంగా 2028 జూన్ తర్వాతకి  వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఇంతలా ఆలస్యం కావడానికి ఇరు పక్కలా ఉన్న భారీ కమిట్‌మెంట్స్ మరియు దర్శకుడు నెల్సన్ పడిన ఒక విచిత్రమైన డైలమానే ప్రధాన కారణమని తెలుస్తోంది.

రజనీకాంత్‌ సినిమానే ముఖ్యం 

ప్రస్తుతం నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన ఇండస్ట్రీ హిట్ జైలర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ పనుల్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సాధించే ఫలితంపైనే నెల్సన్ తదుపరి అడుగులు ఆధారపడి ఉన్నప్పటికీ, ఆయన ముందుకు ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

also read :కొత్త మలుపు రివ్యూ: సింగర్ సునీత కొడుకు హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?

తమిళ చలనచిత్ర చరిత్రలోనే కలలో కూడా ఊహించని విధంగా, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సూపర్ స్టార్ రజనీక్యాంత్ మరియు ఉలగనాయగన్ కమల్ హాసన్ కలయికలో ఒక మెగా మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించేందుకు నెల్సన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. భారతీయ సినీ రంగంలోనే ఇదొక చరిత్ర సృష్టించే ప్రాజెక్ట్ కానుండటంతో, నెల్సన్ సైతం ఈ  ల్యాండ్‌మార్క్ చిత్రానికే తన పూర్తి సమయాన్ని కేటాయించి, మొదట పట్టాలెక్కించేందుకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.

‘డ్రాగన్’ షూటింగ్ పూర్తయిన వెంటనే ‘గాడ్ ఆఫ్ వార్’

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ‘డ్రాగన్’ షూటింగ్ పూర్తయిన వెంటనే అస్సలు గ్యాప్ తీసుకోకుండా, టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే మైథో-యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటికే తన బల్క్ కాల్షీట్లను కేటాయించారని సమాచారం.

also read :మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇసుకలో పాతిపెట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్!

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యే లోపు, అటు దర్శకుడు నెల్సన్ కూడా రజనీకాంత్-కమల్ హాసన్ ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సమీకరణాలన్నీ లెక్కేస్తే ఈ రెండు భారీ చిత్రాలు పూర్తి కావడానికి కనీసం రెండేళ్లకు పైగా సమయం పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్యాప్ కారణంగా తారక్-నెల్సన్ మాస్ కాంబో 2028 చివరి వరకూ రానట్లేనని స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో రజనీ-కమల్ సినిమాపై ఒక వర్గం హైప్ పెంచుతుంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఆలస్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.చూడాలి మరి నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతున్న ఈ రూమర్స్ కి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారో !

Related News

రామ్ గోపాల్ వర్మ ఆ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా?

వెండితెర అరంగేట్రానికి సిద్ధమైన బాలయ్య కూతురు!

నాన్న ట్రీట్మెంట్ కి డబ్బులు ఇవ్వండి – డైరెక్టర్ అజయ్ భూపతి ఎమోషనల్ కామెంట్స్

Big Breaking : దగ్గుబాటి బ్రదర్స్ కి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్ట్ తప్పదా..?

సైమాలో ‘మిరాయ్’ మోత.. 11 నామినేషన్స్‌తో రికార్డ్!

రణ్‌బీర్‌కు క్లాస్ తీసుకున్న మహాభారత్ శ్రీకృష్ణుడు.. కారణం ఇదే!

6 వేల పాటలు పాడిన గాయని.. కె. జమునారాణి కన్నుమూత

ఎట్టకేలకు కొట్టేశాడు.. అఖిల్ కెరీర్‌లో తొలి 100 కోట్ల సినిమా..!

Big Stories

Advertisement
×