E-Paper
Advertisement

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!
Advertisement

Car Reverse Camera: నగరాల్లో ట్రాఫిక్ పెరిగిపోతున్న కొద్దీ కారును ఇరుకైన ప్రదేశాల్లో పార్క్ చేయడం వాహనదారులకు పెద్ద సవాలుగా మారుతోంది. వెనుకవైపునకు వెళ్తూ కారును పార్క్ చేసే క్రమంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వాహనానికి స్క్రాచెస్ పడటం, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మార్కెట్లో ఎన్నో రకాల రివర్స్ పార్కింగ్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రూ. 2,000 కంటే తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న 5 క్వాలిటీ రివర్స్ కెమెరాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

Nippon Reverse Parking Camera

ఆటోమొబైల్ పరికరాలకు సంబంధించి నమ్మదగిన బ్రాండ్‌గా నిప్పాన్ (Nippon)కు పేరుంది. అయితే ఈ కంపెనీ నుంచి వచ్చిన రివర్స్ కెమెరా యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇది డ్యాష్ బోర్డ్ స్క్రీన్ పై విజువల్స్ ను స్పష్టం గా చూపిస్తూ.. పార్కింగ్ కు సాయపడుతుంది. రాత్రి వేళల్లో కూడా కారు వెనుక ఉన్న అడ్డంకులను దీని ద్వారా ఈజీగా గుర్తించొచ్చు.

Wagzo Night Vision 8 LED

Advertisement

చీకటిగా ఉండే పార్కింగ్ స్థలాల్లో, రాత్రి వేళల్లో కార్ రివర్స్ చేసేవారికి Wagzo నైట్ విజన్ కెమెరా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇందులో ఉన్న 8 సాలిడ్ LED లైట్లు చీకటిలోనూ వెనుక వైపు స్పష్టమైన వెలుతురును అందిస్తాయి. బడ్జెట్ ధరలో అత్యుత్తమ నైట్ విజన్ కావాలనుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది.

Audio Wheels 1080P HD Fisheye Dome

కారు వెనుక భాగంలో ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేసే (Wide Viewing Angle) రివర్స్ కెమెరా కోరుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు. దీనిలోని 1080P HD ఫిష్ ఐ లెన్స్ వల్ల కారు వెనుక వైపు ఉండే ప్లేస్ చాలా వరకు కవర్ అవుతుంది. దీనివల్ల సైడ్ బ్లైండ్ స్పాట్స్ తగ్గి.. సేఫ్ గా కారును పార్కింగ్ చేసేందుకు వీలు కలుగుతుంది.

FABTEC AHD Car Rear View

Advertisement

కారులో ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్లు వాడుతున్న వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది HD క్వాలిటీ దృశ్యాలను చూపించడంతో పాటు IP67 వాటర్‌ఫ్రూఫ్ రేటింగ్‌ను కలిగి ఉంది. కాబట్టి వర్షం పడుతున్న సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డిస్ ప్లే స్పష్టంగా కనిపిస్తుంది.

Also Read: బంగారు షాపులో కేడీ ఎలుక.. రాత్రికి రాత్రే ఉంగరాలు, గొలుసులు మాయం.. సీసీటీవీ చూస్తే..!

NEXTOOL 1080P HD/720P Convertible

కారు స్క్రీన్లను బట్టి రిజల్యూషన్ మార్చుకునే స్మార్ట్ రివర్స్ కెమెరా కోరుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు. ఇది 1080P, 720P క్వాలిటీతో స్క్రీన్ పై కారు వెనుక వైపు దృశ్యాలు చూపిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ, మెరుగైన క్లారిటీ కోరుకునే వారికి ఇది తక్కువ ధరలో మంచి ఆప్షన్ చెప్పవచ్చు.

Also Read: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్‌లోనే లైవ్ టీవీ!

Tags

Related News

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

ఈవీ మార్కెట్‌లో సరికొత్త సంచలనం.. సింపుల్ అరైవ్ వస్తోంది!

Big Stories

Advertisement
×