E-Paper
Advertisement

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!
Advertisement

Phone Wet in Rain: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వేడి వేడి పకోడీలు తింటూ వర్షాన్ని ఆస్వాదించడం ఎంత సరదాగా ఉంటుందో, అదే వర్షంలో జేబులో ఉండే స్మార్ట్‌ఫోన్ తడిసిపోతుందేమోననే భయం కూడా అంతే ఉంటుంది. అనుకోకుండా కురిసే వర్షంలో తడవడం వల్లనో, లేక అనుకోకుండా చేతిలోంచి నీళ్లలో, చెరువు లాంటి నీటి ప్రదేశాల్లోనో పడిపోవడం వల్లనో ఫోన్ తడిసిపోవడం చాలా సహజంగా జరుగుతుంటుంది.

అయితే, ఫోన్ నీటిలో పడగానే చాలామంది కంగారులో సరిగ్గా ఆలోచించకుండా కొన్ని పనులు చేస్తుంటారు. నీళ్లు లోపలికి వెళ్లాయో లేదో అని చూడటానికి స్విచ్ ఆన్ చేయడం, ఛార్జింగ్ పిన్ పెట్టి చెక్ చేయడం లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. నిజానికి ఫోన్ నీటిలో పడటం వల్ల జరిగే నష్టం కంటే, మనం చేసే ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్లే అది శాశ్వతంగా పాడైపోయే ప్రమాదం ఎక్కువ. మరి ఫోన్ గనుక నీటిలో పడితే వెంటనే ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలేవో ఇప్పుడు చూద్దాం!

స్విచ్ ఆఫ్ చేయడం:

Advertisement

ఫోన్ తడవగానే చాలామంది అది పనిచేస్తుందో లేదో అని చూడటానికి అన్‌లాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నీటిలో పడగానే ముందుగా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయాలి. లోపలికి నీరు వెళ్లినప్పుడు ఫోన్ ఆన్‌లో ఉంటే మదర్‌బోర్డ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి శాశ్వతంగా పాడవుతుంది.

Also Read: రామాయణంలో లక్ష్మణుడి ప్రాణం కాపాడిన సంజీవని.. నిజంగానే ఒడిశాలోని ఈ కొండపై ఉందా?

వెంటనే ఛార్జ్ చేయొద్దు:

Advertisement

ఫోన్ తడిసిన వెంటనే ఛార్జింగ్ పెట్టడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఛార్జింగ్ పోర్ట్ లేదా బ్యాటరీ పాడైపోతాయి. ఒకవేళ మీ ఫోన్ స్క్రీన్‌పై ‘తేమ ఉంది’ అని వార్నింగ్ కనిపిస్తే.. ఫోన్ పూర్తిగా ఆరే వరకు ఛార్జర్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

సిమ్ కార్డ్ తీసేయాలి:

ఫోన్ ఆఫ్ చేసిన వెంటనే సిమ్ ట్రే బయటకు తీసేసి.. సిమ్, మెమరీ కార్డులను పక్కన పెట్టాలి. దీంతో ఫోన్ లోపలికి గాలి వెళ్లి తేమ త్వరగా ఆరిపోవడానికి మార్గం సుగుమం అవుతుంది. ఇలా చేయడం వలన సిమ్ కార్డ్స్ కూడా సురక్షితంగా ఉంటాయి.

కాటన్ గుడ్డతో తుడవాలి:

పొడిగా ఉన్న మైక్రోఫైబర్ లేదా సున్నితమైన కాటన్ గుడ్డతో ఫోన్‌ను మెల్లగా తుడవాలి. స్పీకర్లు, ఛార్జింగ్ పోర్ట్ భాగాలను జాగ్రత్తగా ప్యాట్ చేస్తూ తుడవాలి. నీరు బయటకు వస్తుందనే ఉద్దేశంతో ఫోన్‌ను గట్టిగా ఊపడం లేదా విసిరికొట్టడం చేయకూడదు. దానివల్ల నీరు ఇంకా లోపలికి వెళ్తుంది.

హెయిర్ డ్రైయర్ వాడొద్దు:

ఫోన్‌ను త్వరగా ఆరబెట్టాలనే కంగారులో హెయిర్ డ్రైయర్ అస్సలు వాడకూడదు. వేడిగాలి వల్ల ఫోన్ లోపలి గ్లూ కరిగిపోవడమే కాకుండా డిస్‌ప్లే పాడవుతుంది. అలాగే బియ్యంలో పెట్టడం కంటే సిలికా జెల్ ప్యాకెట్ల మధ్య ఉంచడం కొంతవరకు మేలు చేస్తుంది. ఇవన్నీ చేసినా ఫోన్ ఆన్ కాకపోతే వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం ఉత్తమం.

Also Read: మనిషి కంటే ఎత్తు.. 15 ఏళ్లకు ఒక్కసారే పూచే ‘హిమాలయన్ డైమండ్’ విశేషాలివే!

Tags

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×