E-Paper
Advertisement

తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త యాక్షన్ ప్లాన్.. రంగంలోకి బూత్ లెవల్ ఏజెంట్లు!

తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త యాక్షన్ ప్లాన్.. రంగంలోకి బూత్ లెవల్ ఏజెంట్లు!
Advertisement

Electoral Roll: స్వేచ్ఛ బ్యూరో: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ).. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలో దిశా నిర్దేశం చేశారు.

బిఎల్ఓలతో సమన్వయం.. కీలక బాధ్యతలు

Advertisement

భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాలను పూర్తి పారదర్శకంగా, పక్కాగా రూపొందించేందుకు ఈ సవరణ కార్యక్రమాన్ని చేపట్టిందని సుధాకర్ గౌడ్ వివరించారు. ఈ ప్రక్రియలో బీఎల్ఏలు కేవలం వీక్షకులుగా కాకుండా, ప్రభుత్వ బూత్ లెవల్ అధికారులతో (బీఎల్ఓలు) నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయడం, మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగించడం, ఉపాధి లేదా ఇతర కారణాల వల్ల వలస వెళ్లిన వారి వివరాలను సవరించడం వంటి పనుల్లో బీఎల్ఏలు చురుకైన పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.

లక్ష్యం.. అర్హులందరికీ ఓటు హక్కు

Advertisement

ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించి, ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపైనే ఉందన్నారు. అనర్హుల ఓట్లను తొలగిస్తూ, అర్హులందరికీ జాబితాలో చోటు కల్పించినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన విలువ వస్తుందని, ఈ సవరణ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా విజయవంతం చేయాలని బండి సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు.

Also Read: హెల్త్ కార్డుల ఇష్యూపై వెనక్కి తగ్గేదే లేదు.. ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం!

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×