E-Paper
Advertisement

రామ్ గోపాల్ వర్మ ఆ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా?

రామ్ గోపాల్ వర్మ ఆ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా?
Advertisement

Ram Gopal Varma: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు శివ, క్షణక్షణం, గోవిందా గోవిందా, రక్త చరిత్ర అంటూ ఎన్నో మంచి చిత్రాలను తెరకెక్కించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఆ తర్వాత కాలంలో ఎక్కువగా విమర్శలకు గురయ్యేలా చిత్రాలు చేస్తూ అభిమానులను కూడా ఆగ్రహానికి గురి చేస్తున్నారు. అంతేకాదు సమాజంలో పలు అంశాలపై స్పందిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న ఈయన గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఒక స్టార్ హీరోయిన్ ని రామ్ గోపాల్ వర్మ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పైగా ఈ విషయాన్ని ఒక బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ బహిరంగంగా చెప్పడం మరింత చర్చకు దారి తీసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రాంగోపాల్ వర్మ రహస్యపు పెళ్లి..

బాలీవుడ్ సీనియర్ జర్నలిస్టు జ్యోతి వెంకటేష్(Jyoti Venkatesh) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అసలు విషయాన్ని బయటపెట్టారు.m ఆయన మాట్లాడుతూ.. ఊర్మిళ మాతోండ్కర్ (Urmila matondkar)..రాంగోపాల్ వర్మ రహస్యంగా వివాహం చేసుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే.. సిద్ధార్థ్ కన్నన్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఈ విషయాలను పంచుకున్నారు.. ఆయన మాట్లాడుతూ.. “ఒక తెలుగు స్టార్ హీరో అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చారు. ఆ సమయంలో నన్ను కలిసినప్పుడు ఆర్జీవి – ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు కదా.. ఎందుకు ఈ విషయాన్ని మీరు రాయడం లేదు? అని అడిగారు?.దీంతో నేను ఆశ్చర్యపోయాను. నిజంగానే వాళ్లకు పెళ్లి జరిగిందా? అని అడిగితే .. అవును ఆంధ్రప్రదేశ్లోని ఒక ఆలయంలో వీరి పెళ్లి జరిగింది అని చెబుతూ.. వారి వివాహం జరిపించిన పూజారి ఫోన్ నెంబర్ కూడా నాకు ఇచ్చారు. అయితే నేను ఈ వార్తను ప్రచురించే ముందు ఊర్మిళకి ఫోన్ చేశాను. అయితే ఆమె ఏడుస్తూ నాపై అసంతృప్తి వ్యక్తం చేసిందే తప్ప పెళ్లి జరగలేదు అని మాత్రం ఆమె ఖండించలేదు.

Advertisement

ALSO READ:వెండితెర అరంగేట్రానికి సిద్ధమైన బాలయ్య కూతురు!

జర్నలిస్ట్ బయటపెట్టిన నిజాలు..

దీంతో నేను మళ్ళీ వర్మకి ఫోన్ చేస్తే ఆయన దీనిపై మాట్లాడడానికి నిరాకరిస్తూ నో కామెంట్స్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసాడు. అయితే ఆ తర్వాత కాలంలో వీళ్ళిద్దరూ విడిపోయారు. దీనికి కూడా కారణాలు నాకు తెలుసు. ఊర్మిళ ఆర్జీవితో చట్టబద్ధంగా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాలని కోరుకుంది. కానీ ఆర్జీవి అందుకు సిద్ధపడకపోవడం వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు అంటూ ఊహించని కామెంట్లు చేశారు..ఇక ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ రూమర్స్ కి మరింత బలం చేకూరేలా కామెంట్స్..

Advertisement

ఇకపోతే రాంగోపాల్ వర్మ , ఊర్మిళ మాతోండ్కర్ కాంబినేషన్లో గాయం, రంగీలా, అంతం, సత్య వంటి ఎన్నో చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలలో ఊర్మిళా హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలా హిట్ కాంబినేషన్ గా నిలిచిన ఈ పెయిర్ ఆ తర్వాత మళ్లీ కలిసి పని చేయకపోవడంపై పలు రకాల రూమర్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు జర్నలిస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ రూమర్స్ కి మరింత బలం చేకూరిందనే చెప్పాలి.

Related News

వెండితెర అరంగేట్రానికి సిద్ధమైన బాలయ్య కూతురు!

నాన్న ట్రీట్మెంట్ కి డబ్బులు ఇవ్వండి – డైరెక్టర్ అజయ్ భూపతి ఎమోషనల్ కామెంట్స్

Big Breaking : దగ్గుబాటి బ్రదర్స్ కి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్ట్ తప్పదా..?

సైమాలో ‘మిరాయ్’ మోత.. 11 నామినేషన్స్‌తో రికార్డ్!

రణ్‌బీర్‌కు క్లాస్ తీసుకున్న మహాభారత్ శ్రీకృష్ణుడు.. కారణం ఇదే!

6 వేల పాటలు పాడిన గాయని.. కె. జమునారాణి కన్నుమూత

ఎట్టకేలకు కొట్టేశాడు.. అఖిల్ కెరీర్‌లో తొలి 100 కోట్ల సినిమా..!

Big Stories

Advertisement
×