Anil Ravipudi’s Hilarious Promotion :అనిల్ రావిపూడి…టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ .కేవలం థియేటర్లలోనే కాదు, అంతకంటే ముందే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై కూడా ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేయాలో బాగా తెలిసిన మల్టీ టాలెంటెడ్.విషయంలోకి వెళ్తే ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబో ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను లైన్‌లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
గతంలో వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘F2’ (2019), ‘F3’ (2022) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పంట పండించి భారీ వసూళ్లు సాధించగా, కల్యాణ్ రామ్‌తో ఆయన తెరకెక్కించిన ‘పటాస్’ (2015) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. ఈ ఇద్దరు మాస్ అండ్ క్లాస్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లోకి తెస్తుండటంతో సహజంగానే సినీ ప్రియులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమా అఫీషియల్ గా ప్రారంభం కాకముందే, అనిల్ రావిపూడి తన స్టైల్ పబ్లిసిటీ డోస్‌ను అప్పుడే వదిలారు.
ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు .సాధారణంగా సినిమాలకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే నాలుగు గోడల మధ్య, లగ్జరీ హోటల్ రూమ్స్‌లో జరుగుతాయి. కానీ అనిల్ రావిపూడి ఆలోచనలు ఎప్పుడూ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాయి కాబట్టి, ఈ అప్‌డేట్‌ను నెటిజన్ల పొట్టచెక్కలయ్యేలా ప్లాన్ చేశారు. టాలీవుడ్ ఆల్‌టైమ్ క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘వివాహ భోజనంబు’ సినిమాలో లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందాన్ని ఇసుకలో పాతిపెట్టి, సుత్తి వీరభద్రరావు గారు ‘హైదరాబాద్.. సికింద్రాబాద్.. అదిలాబాద్’ అంటూ చేసే ఐకానిక్ కామెడీ సీన్‌ను అనిల్ ఇక్కడ అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు.
also read :రామ్ చరణ్ ‘పెద్ది’ 500 కోట్ల మార్కును అందుకోవడం కష్టమేనా?
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ను ఏకంగా పీకల్లోతు ఇసుకలో పూడ్చిపెట్టి.. సినిమాకు ఎలాంటి పాటలు కావాలో అనిల్ ఆర్డర్లు వేయడం ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ‘మనకు క్లాస్ సాంగ్ కావాలి.. మాస్ సాంగ్ కావాలి.. ఎమోషనల్ బిట్, మెలోడీ ట్రాక్, క్రేజీ డీజే సాంగ్.. వాటన్నింటినీ మించి థియేటర్లు దద్దరిల్లేలా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కావాలి’ అంటూ అనిల్ రావిపూడి చెప్తుంటే, ఇసుకలోంచి జీవీ ప్రకాష్ ఇచ్చిన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
ఈ ఫన్నీ సీక్వెన్స్‌లో జీవీ ప్రకాష్ స్పందిస్తూ.. ‘బాస్.. ట్యూన్స్ కంపోజ్ చేయాలంటే కేవలం హార్మోనియం ఉంటే సరిపోదు, రెండు చేతులు.. పది వేళ్ళు కూడా చాలా ముఖ్యం. దయచేసి కనీసం నా చేతులనైనా బయటకు తీయండి మహాప్రభో’ అంటూ ప్రాధేయపడటం కామెడీని పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇక్కడితో ఈ రచ్చ ముగిసిపోలేదండోయ్. మరి ఈ పాటలకు అద్భుతమైన లిరిక్స్ అందించే రైటర్ ఎక్కడ అని అడగ్గా.. ‘ఆయనను రెండు రోజుల ముందే ఇక్కడే పాతిపెట్టా’ అంటూ పక్కనే ఇసుకలో తలకాయ మాత్రమే కనిపిస్తున్న ప్రముఖ సినీ రచయిత అనంత్ శ్రీరామ్‌ను అనిల్ చూపించడంతో ఈ వీడియో ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫార్మ్స్‌లో క్షణాల్లో ట్రెండింగ్‌గా మారింది.
also read :పూరి మార్క్ యాక్షన్ థ్రిల్లర్.. ఉత్కంఠ రేపుతోన్న ‘స్లమ్‌డాగ్’ టీజర్ మేకింగ్ విజువల్స్
గతంలో కూడా అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ (2020) సమయంలోనూ, అలాగే నందమూరి బాలకృష్ణతో నిర్మించిన ‘భగవంత్ కేసరి’ (2023) ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలలో తానే స్వయంగా యాక్ట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు జీవీ ప్రకాష్, అనంత్ శ్రీరామ్‌లను ఉపయోగించి చేసిన ఈ ‘ఇసుక ప్లాన్’ సోషల్ మీడియాలో టాప్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. సినిమా షూటింగ్ ఇంకా ఊపందుకోకముందే ఈ రేంజ్ క్రేజ్ క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్, రేపు థియేటర్లలో రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి మరి !