Akhil Lenin: హిట్ ఎప్పుడు..హిట్ ఎప్పుడు..హిట్ ఎప్పుడు..గత కొన్నేళ్లుగా అఖిల్ అక్కినేనిని వెంటాడిన ప్రశ్న ఇది.’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’పర్లేదనిపించినప్పటికీ కమర్షియల్ సక్సెస్ చూళ్లేకపోయింది.ఇక అసలైన కమర్షియల్ సక్సెస్ ఎప్పుడు అని ఎదురుచూసిన అఖిల్ కు ఎట్టకేలకి లెనిన్ రూపంలో దక్కింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో దూసుకెళ్తూ అఖిల్ కి సాలిడ్ బాగ్ బ్లాక్ బస్టర్ అందించింది.రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో వారానికి వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్కులు దాటడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాపిక్ గా మారింది.అక్కినేని ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ సెలబ్రేట్ చేస్తుండగా ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాబి ప్రత్యేకంగా చూస్తున్నాయి.
మొదటి నుంచే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా క్రమంగా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆదరించారు .అయితే వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ మాత్రమే కాదు వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు సాధించడంతో డిస్ట్రిబ్యూటర్లలో కొత్త ఉత్సాహం కనిపించింది .ఇక రెండు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి ఉంచిన దానికంటే ఎక్కువ వసూళ్లు రావడం విశేషం.
ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా అఖిల్ కి ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి.ఇప్పటివరకు నటించిన అఖిల్ ,హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబల్ బ్యాచిలర్ ,ఏజెంట్ ఇలా ఏ సినిమా వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద బకెట్ తన్నేసినవే .ముఖ్యంగా 2023 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఏజెంట్ ఎటు వెళ్లిపోయాడో తెలియదు.
దీంతో అఖిల్ తన తర్వాత విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు.ఒకరకంగా మంచి స్క్రిప్ట్ కోసమే మూడేళ్లు కేటాయించాడంటే ఈ సినిమా తనకి ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది.దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరుఈ సినిమాని ,మాస్, యాక్షన్, ఎమోషన్ కలయికతో తెరకి ఎక్కించాడు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ సినిమాకి మెయిన్ ఎసెట్ అని చెప్పాలి.
also read :ప్రియాంక జైన్ షాకింగ్ సాంగ్.. అందాల విందుపై నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్, ఇదిగో వీడియో!
ఇంకోవైపు పాటలు ,బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్ అన్ని సినిమాకి కలిసి వచ్చాయి .ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ కొన్ని ఎలివేషన్స్ సీన్స్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.
సినిమా బిజినెస్ విషయానికి వస్తే 55 కోట్ల బడ్జెట్ తో ఎక్కిన ఈ సినిమాకి దాదాపు 22 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది .దీంతో 44 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన సినిమా నాలుగో రోజుకే లాభాల్లోకి వెళ్లడం విశేషం .
ఇక ఇప్పటికీ ఈ సినిమా మరికొన్ని థియేటర్లలో రన్ అవుతుండటంతో ఫైనల్ గా మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ఉంచనా .ఇక 100 కోట్ల గ్రాస్ పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే అఖిల్ తన సోషల్ మీడియాలో ఫాన్స్ కి స్పెషల్ గా థాంక్స్ చెప్పుకొచ్చాడు.నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ విజయం అంకితం మీ ప్రేమ మీరు సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది ఇంకా మంచి సినిమాలతో త్వరలో కలుస్తాను.అంటూ చేసిన పోస్ట్ ఎప్పుడు వైరల్ గా అయిపోయింది .
also read :జగపతిబాబు మొహానికి సర్జరీ..? అసలు ఏమైంది..!
అభిమానులకు కూడా ఎట్టకేలకి మా హీరోకి 100 కోట్ల బొమ్మ వచ్చేసిందోచ్ అంటూ పెద్ద ఎత్తున పోస్ట్లు పెట్టేస్తున్నారు .అఖిల్ కుటుంబానికి కూడా ఈ సక్సెస్ ఎంతో ప్రత్యేకమైన చెప్పాలి. ఇక ప్రొడ్యూసర్స్ నాగార్జున, నాగ వంశీ పెట్టుకున్న నమ్మకం మొత్తానికి ఫలించింది .చూడాలి మరి ఈ సినిమా సక్సెస్ తో ఈ అక్కినేని అయ్యగారు ముందు ముందు ఇలాంటి విజయాలను చవి చూస్తాడో !