NTR Prashanth:డ్రాగన్ ..యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పక్కర్లేదు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ని పలకరించేందుకు చాలా సమయమే తీసుకుంటుంది.
కానీ సినిమా నుండి వస్తున్న అప్‌డేట్స్ మాత్రం తారక్ ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన టాక్ బయటకు వచ్చింది.
అదే.. సినిమాలో ఏకంగా ఓ భారీ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారని. మాములుగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో పాటల కంటే యాక్షన్, ఎలివేషన్లు, డార్క్ టోన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్న సంగతి తెల్సిందే. కానీ ఈసారి మాత్రం పాట విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా మేకర్స్ డిజైన్ చేయబోతున్నారని తెలుస్తుంది.
అంటే ఇప్పటివరకు యాక్షన్ బ్లాక్ లకి భారీ స్థాయిలో ఖర్చు పెట్టిన మేకర్స్ ఇపుడు పాటకి కూడా కోట్లు కుమ్మరించబోతున్నారన్నమాట.ఇక ఈ స్పెషల్ సాంగ్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వినిపిస్తోంది. అదేంటో తెలుసా ..ఎన్టీఆర్ హీరోయిన్ రుక్మిణి వసంత్ తో పాటు ఈ పాటలో మరో ఇద్దరు స్టార్ బ్యూటీలు స్టెప్పులు వేయనున్నారట.
మరి అసలు కథలో వాళ్ల పాత్రలు ఏంటి? నిజంగానే కథలో భాగంగా వస్తారా ..లేక పాటకే పరిమితమా అన్నది మేకర్స్ అప్ డేట్ వదిలితే కానీ తెలీదు.ఒక వేళ ఇదే గనుక నిజమైతే సినిమా ప్రమోషన్స్‌కు మంచి కంటెంట్ దొరికినట్టే అని చెప్పాలి .
అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తుంది. కథపై క్లారిటీ లేదు. . సినిమాలో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అనే దానిపైనా స్పష్టత లేదు. కానీ సినిమాకు సంబంధించిన గాసిప్స్ ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తూనే ఉన్నాయి.
ఇక ఎన్టీఆర్ భుజానికి సంబంధించిన సర్జరీ కారణంగా కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్ మొదటి వారంలో సెట్స్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.అయితే అప్పటివరకు హీరో అవసరం లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ పూర్తి చేయనున్నారట. అంటే హీరో లేకపోయినా షూటింగ్ ఆగకుండా చూసుకుంటున్నారన్నమాట.
ఇక తారక్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఇదే సమయంలో షాహిద్ కపూర్, ఆలియా భట్ పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.1960ల బ్యాక్‌డ్రాప్ అంటున్నారు. నల్లమందు మాఫియా అంటున్నారు. యుద్ధ వాతావరణం అంటున్నారు. ఇప్పుడు భారీ స్పెషల్ సాంగ్ అంటున్నారు.కానీ వీటిలో ఏది నిజమో ఏది రూమరో మేకర్స్ నుండి మాత్రం క్లారిటీ రావట్లేదు.
ఇక ఈ సినిమాకి సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్–రవి బస్రూర్ కాంబినేషన్‌కు ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఈ సినిమాలో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ ఒక రేంజ్ లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ లవర్స్ .ఇక సినిమా విడుదల 2027 జూన్ 11న అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అంటే ఇంకా చాలా సమయం ఉంది.
అప్పటివరకు ఇలాంటి అప్‌డేట్స్ ఇంకెన్ని వస్తాయో చూడాలి.మొత్తానికి ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ అంచనాలు ఎంత పెరిగితే.. సినిమాపై ఒత్తిడి కూడా అంతే పెరుగుతుందని చెప్పక్కర్లేదు .
Also read :గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!
మరి ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో విజువల్ ఐ ఫీస్ట్ అందించిన నీల్ మావ ఈసారి ఎన్టీఆర్‌తో అంతకు మించిన సినిమా ఇస్తాడా లేక పెరిగిన ఒత్తిడికి చిత్తయి చేతులు ఎత్తేస్తాడా అనేది వచ్చే ఏడు జూన్ 11న తేలిపోనుంది.