Aamir Khan:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అమీర్ ఖాన్ (Aamir Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో అద్భుతమైన నటన పెర్ఫార్మెన్స్ తో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఒకవైపు నటుడు గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా సినీ రంగంలో అత్యంత ప్రతిభావంతమైన నటుడిగా పేరు దక్కించుకున్నారు. తన అద్భుతమైన నటనతో ఏడు ఫిలిం ఫేర్ పురస్కారాలతో పాటు నాలుగు నేషనల్ అవార్డులు కూడా అందుకొని ఆశ్చర్యపరిచారు. ఒకవైపు బాలీవుడ్లో సినిమాలలో నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించడమే కాకుండా ఇటు సౌత్ సినిమాలలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఒకవైపు కెరియర్ లో బిజీగా ఉన్నా.. ఇప్పుడు తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. గత రెండు సంవత్సరాలుగా ప్రముఖ వ్యాపారవేత్త గౌరీ స్ప్రాట్ తో రిలేషన్ లో ఉన్న అమీర్ ఖాన్ ఎట్టకేలకు అధికారికంగా వివాహం చేసుకున్నారు. ఈ జంట శనివారం మధ్యాహ్నం ముంబైలోని బాంద్రాలో ఉన్న అమీర్ ఖాన్ నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ప్రభుత్వ నియమాల ప్రకారం రిజిస్ట్రేషన్ వివాహం చేసుకున్నారు. 61 ఏళ్ల అమీర్ ఖాన్.. 47 ఏళ్ల గౌరీ స్ప్రాట్ శనివారం అనగా జూలై 5వ తేదీన మధ్యాహ్నం 12:45 గంటలకు వివాహ పత్రాలపై సంతకాలు చేశారు. ఇక దీంతో వీరి బంధంలో కొత్త అధ్యాయం మొదలయ్యింది. ముఖ్యంగా ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సహ సుమారుగా 150 మంది అతిధులు హాజరయ్యారు.
ఇకపోతే ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో అమీర్ ఖాన్ వారసులు జునైద్ ఖాన్, ఇరా, ఆజాద్ లతో పాటు గౌరీ తనయుడు కూడా సందడి చేశారు. ఇకపోతే ఈ ఏడాది తమ బంధాన్ని ధ్రువీకరించిన ఈ జంట సుమారుగా 25 ఏళ్లుగా ఒకరికొకరు తెలిసినప్పటికీ రెండేళ్ల క్రితం డేటింగ్ ప్రారంభించినట్లు అమీర్ ఖాన్ వెల్లడించారు. ఈ ఏడాది తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన వీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ వివాహంతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. అలా ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు.
ఇక అమీర్ ఖాన్ వివాహ జీవిత విషయానికి వస్తే.. మొదట ఈయన ప్రముఖ నిర్మాత రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఇరా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల జునైద్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఏక్ దిన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక ఈమెతో విడాకులైన తర్వాత 2005లో మరో చిత్ర నిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు జన్మించారు. ఆ తర్వాత 2021లో వీరు విడిపోయారు. ఇక ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్నారు అమీర్ ఖాన్. అటు గౌరీ కి కూడా గతంలో వివాహం జరిగి ఒక కొడుకు కూడా ఉన్నారు. ఆమె కూడా తన భర్త కి విడాకులు ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం గౌరీ ముంబైలో ఒక బిబ్లంట్ సెలూన్ నడుపుతున్నారు.
ALSO READ: Kissik Talks: ఈటీవీకి మరోబిడ్డ.. ఆ సీరియల్ వల్లే బ్యాన్ చేసే పరిస్థితి.. నిజం బయటపెట్టిన సోనియా!