E-Paper
Advertisement

July 6 Holiday: జులై 6న స్కూల్స్, కాలేజీలకు సెలవా?

July 6 Holiday: జులై 6న స్కూల్స్, కాలేజీలకు సెలవా?
Advertisement

July 6 Holiday: విద్యార్థులకు సెలవుల సీజన్ మెల్లగా మొదలైంది. జూలై 6న సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఆ రోజు మూతబడతాయి. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఎందుకు ఇస్తున్నట్లు? వాటిపై ఓ లుక్కేద్దాం.

జులై 6న స్కూల్స్, కాలేజీలకు సెలవు

Advertisement

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 6న రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించింది. అంటే సోమవారం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు మూతపడనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారంతోపాటు మరొక రోజు రెస్ట్ దొరికింది.

వరుసగా రెండు రోజులు సెలవు కావడంతో విద్యార్థులు టూర్ ప్లాన్ చేసుకున్నారు. బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల మేరకు.. జూలై 6న ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలు మూతబడనున్నాయి. సెలవు ప్రకటించడానికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Advertisement

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి.. సెలవు ప్రకటన చేసిన బెంగాల్ ప్రభుత్వం

రాజకీయాలు, విద్యారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకుంది. నార్మల్ గా అయితే శ్యామ్ ప్రసాద్ జయంతి రోజు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈసారి 125వ జయంతి కావడంతో అధికారిక సెలవును ప్రకటించింది బెంగాల్ ప్రభుత్వం.

జూలై ఒకటి వైద్యుల దినోత్సవం సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం ఆఫ్ డే సెలవు ఇచ్చింది. ఈ సెలవు బెంగాల్ రాష్ట్రానికి వర్తిస్తుందని స్పష్టం చేశారు అధికారులు. మిగతా రాష్ట్రాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ప్రకటనను చూసి అయోమయానికి గురి కావద్దు. రాష్ట్ర ప్రభుత్వ సెలవులను స్వతంత్రంగా ప్రకటిస్తుంది.

ALSO READ: బిష్ణోయ్ గ్యాంగ్‌కు కోలుకోలేని షాక్.. జాయింట్ ఆపరేషన్‌లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ మృతి!

జూలై 6న బెంగాల్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతబడుతున్న నేపథ్యంలో ప్రజలు తమ అవసరమైన పనులను ముందుగా పూర్తి చేసుకోవడం బెటర్. విద్యార్థులు తమ ప్రాంతానికి సంబంధించిన సెలవు ప్రకటనను పరిశీలించి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు అధికారులు.

Related News

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!

జంతర్ మంతర్ 2.0.. అక్టోబర్ 10న చలో ఢిల్లీ.. సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటం!

Big Stories

Advertisement
×