BigTV English

OG Movie : ‘ఓజీ ‘ ఫైర్ సాంగ్.. సౌండ్ బాక్స్ పగిలిపోయింది.. ఫ్యాన్‌కు థమన్ గిఫ్ట్

OG Movie : ‘ఓజీ ‘ ఫైర్ సాంగ్.. సౌండ్ బాక్స్ పగిలిపోయింది.. ఫ్యాన్‌కు థమన్ గిఫ్ట్

OG Movie : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఓజీ’.. మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు అందరి దృష్టి ఓజీ పైనే ఉంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఓజిపై మంచి హైప్ క్రియేట్ అవ్వగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది.. దసరా స్పెషల్ గా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సాంగ్ గా ఫైర్ స్టార్మ్ ను విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. కానీ ఈ పాట గురించి ఓ ఫ్యాన్ తెగ ఫీల్ అవుతున్నాడు..


ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన ఫైర్ సాంగ్..

పవన్ కళ్యాణ్ సినిమాలకు డిమాండ్ ఉంటుంది. ఇక ఇప్పుడు రాబోతున్న ఓజీ లాంటి సినిమాలకు రెస్పాన్స్ మాములుగా లేదు. నిన్న రిలీజ్ అయిన సాంగ్ ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ లోనే ఆల్‌టైమ్ హైయ్యెస్ట్ లైక్స్ అందుకున్న సాంగ్ గా ఫైర్ స్టార్మ్ రికార్డుకెక్కింది. అయితే సాంగ్ రిలీజ్ అయ్యి24 గంటలు పూర్తి కాకుండానే ఈ సినిమా రికార్డు స్థాయిలో లైక్స్ దక్కించుకుందంటే ఈ లెక్కన సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు బెల్ బాటప్ ప్యాంట్ లో పవన్ వాకింగ్ స్టైల్, ఆయన లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్, యాక్షన్, గన్ ఫైరింగ్ ఇవన్నీ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తోంది. లిరికల్ వీడియోలో కొన్ని షాట్స్ లో సుజిత్ చూపించిన ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ కూడా బావున్నాయి. సినిమాకు మంచి రికార్డులు దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది..


Also Read : ‘కాంతారా 3 ‘ కన్ఫామ్.. రిషబ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

తమన్ కు ఫ్యాన్ రిక్వెస్ట్.. 

ఓజీ ఫైర్ కు వస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు. సింగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఈ క్రమంలో ఓ ఫ్యాన్ తమన్ కు రిక్వెస్ట్ చేశాడు. తమన్ బ్రో నువ్వు కొట్టే మ్యూజిక్ సౌండ్ కు మా ఇంట్లో సౌండ్ బార్ పగిలిపోయిందని అన్నాడు. మా నాన్న వస్తే ఇప్పుడు ఏమంటాడో అని టెన్షన్ పడుతున్నాను అని తమన్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి దీనిపై ఓజీ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజి ప్రేక్షకుల ముందుకు రానుంది..

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×