BigTV English

Kantara 3 : ‘కాంతారా 3 ‘ కన్ఫామ్.. రిషబ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Kantara 3 : ‘కాంతారా 3 ‘ కన్ఫామ్.. రిషబ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Kantara 3 : కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సినిమా కాంతారా.. ప్రస్తుతం ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా తెరకెక్కించిన ‘కాంతార: చాప్టర్ 1’ని పూర్తి చేసి అక్టోబర్ 2న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సీక్వెల్ గా మరో పార్ట్ రాబోతుందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీక్వెల్‌గా ఉండనుందని, ఇప్పటికే రిషబ్‌ శెట్టి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ మధ్య ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది.. దీనికి సంబంధించి ఇప్పుడు మరో వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. మూడో భాగానికి రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


‘కాంతారా చాప్టర్ 2’.. 

ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. హీరో రిషబ్ శెట్టి.. ఫస్ట్ పార్ట్‌కి కొనసాగింపుగా కాకుండా ప్రీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించారు. దీనికి కూడా రిషబ్ శెట్టి అన్నీ తానూ చూసుకున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి.. ఈ సినిమా షూటింగ్లో ఎన్నో ప్రమాదాలు ఎదురవడంతో చాలామంది ప్రాణాలను కోల్పోయారు. కొన్ని సందర్భాల్లో హీరో రిషబ్ శెట్టి కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్ని అమంత్రాల నడుమ సినిమా పూర్తి అవుతుందా లేదా అని అందరూ అనుకున్నారు. మొత్తానికి సినిమానైతే పూర్తి చేశారు. అక్టోబర్ 2న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Also Read: ఎన్టీఆర్ ముందు రెండు సవాళ్లు.. బాలీవుడ్ లో టార్గెట్ చేశారా..?

‘కాంతారా 3’ కి రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్..? 

కాంతారా 2 ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ అప్పుడే మూడో పార్ట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ మూవీలో కథను మొత్తం చూపిస్తాడో లేక మరో పార్ట్ తీస్తారో అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ పూర్తి వివరాలను అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం. ఇకపోతే కాంతారా       చాప్టర్ 2 కన్నా, మూడో భాగం కోసం రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. రిషబ్‌శెట్టి మొత్తం రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే చేపట్టడంతో ఎంతైనా ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదట.. కేవలం రెమ్యూనరేషన్ ఈ మాత్రం ఉంటే ఇక ఈ సినిమా బడ్జెట్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం రిషబ్ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘జై హనుమాన్‌’ మూవీలోనూ నటించాల్సి ఉంది. ఇటీవలే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీలోనూ ఆయన నటించనున్నారు.. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్నాడు. దీంతోపాటు శ్రీకృష్ణదేవరాయల బయోపిక్‌లోనూ ఆయన నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×