BigTV English

Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్ రిపోర్టు.. కర్మ, కర్త, క్రియ అంతా కేసీఆర్, సిట్ ఏర్పాటు?

Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్ రిపోర్టు.. కర్మ, కర్త, క్రియ అంతా కేసీఆర్, సిట్ ఏర్పాటు?

Kaleshwaram Report:  కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యారేజీల నిర్మాణ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ దేనని తేల్చి చెప్పిన కమిషన్. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులపై నిర్ణయం ఆయనదేనని తేల్చేసింది. మొత్తం ప్రాజెక్టులో విధానపరమైన, ఆర్థిక పరమైన అవకతవకలు, వాప్కోస్ నివేదికను తొక్కి పెట్టారన్నది కమిషన్ ప్రధాన పాయింట్.


కాళేశ్వరం కమిషన్ రిపోర్టు

ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్,O & M అవకతవకలకు కేసీఆరే బాధ్యుడని కమిషన్ ప్రస్తావించింది. అంతేకాదు ఏయే స్థాయిల్లో ఎవరెవరు తప్పులు చేశారనే దానిపై రిపోర్టులో క్లారిటీ ఇచ్చింది.


ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నిర్లక్ష్యాన్ని బయట పెట్టింది జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక. మోడల్ స్టడీ లేకుండా డిజైన్స్ ఆమోదించింది సీడీఓ. నాణ్యత లేని నిర్మాణాలు, థర్డ్ పార్టీ పరిశీలన లేకపోవడం, ఆపరేషన్, నిర్వహణ లోపాలకు సీడీఓ కారణమని చూపిన నివేదిక తేల్చింది. కాళేశ్వరంపై మొత్తం 10 పేజీలతో అధికారుల కంక్లూజన్ నివేదిక బయటకు వచ్చింది.

వాప్కోస్‌ని సంప్రదించకుండానే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లొకేషన్లను మార్చారని పేర్కొంది. వానాకాలం ముందుగానీ తర్వాతగానీ మూడు బ్యారేజ్‌ల ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయలేదని తేల్చింది. నిపుణుల కమిటీ నివేదికను అప్పటి మంత్రి హరీష్‌రావు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని ప్రస్తావించింది.

ALSO READ: ఫామ్‌‌హౌస్‌లో కేసీఆర్ చండీయాగం.. కవిత నిరాహార దీక్ష మాటేంటి?

సీఎం నుంచి అధికారులు వరకు

ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త రాష్ట్ర స్థితిగతులను అప్పటి మంత్రి, ఎంపీ ఈటెల పట్టించుకోలేదని వెల్లడించింది. ఈ లెక్కన ప్రాజెక్టు వెనుక  అప్పటి సీఎం కేసీఆర్ అన్నీ కాగా, దాని వెనుక అప్పటి మంత్రులు ఈటెల, హరీష్‌రావు ఉన్నట్లు తేల్చింది.

తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని భావించినప్పటికీ, ఆ ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం వెనుక ఎలాంటి కారణాలు చెప్పలేదని వెల్లడించింది.పైకి చెబుతున్నట్లుగా తుమ్మడిహట్టి నీటి లభ్యత తక్కువగా ఉండడంతో మేడిగడ్డకు మార్చామంటూ అంటున్నారని సమర్ధించుకున్న విషయాన్ని నేరుగా ప్రస్తావించింది.

భారీ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు కేబినెట్ ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని, దీనివిషయంలో అలాంటిదేమీ జరగలేదని తెలిపింది. జీవో నెంబర్ సైతం ప్రస్తావించింది. పీఎంకు రాసిన లేఖలో ప్రాజెక్టు అంచనా వ్యయం 71 వేల కోట్ల రూపాయలుగా ప్రస్తావించింది. అంచనా వ్యయం పెరగడం వెనుక సీఎం పాత్ర వుందని ప్రస్తావించింది.

విచారణ చేయవచ్చు

సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలను ఏ మాత్రమ పరిగణనలోకి తీసుకోకుండా ‘లమ్‌సమ్’ విధానంలో కాంట్రాక్టును అమలు చేశారని పేర్కొంది. కేసీఆర్ తోపాటు అప్పటి మంత్రలు, అధికారులు ప్రమేయం ఉందని తేల్చేసింది. వాప్కోస్ కు చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలని చెప్పుకొచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ చేసిన విచారణ అవకతవకలను గుర్తించింది.

దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థ చేత విచారణ చేపట్టి, అందుకు బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని రికమెండేషన్లలో పేర్కొంది. కమిషన్ రిపోర్టుపై సోమవారం ఆగష్టు నాలుగున కేబినెట్ సమావేశంలో చర్చించనుంది రేవంత్ సర్కార్. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత విచారణకు ఆదేశించనుంది. దీనిపై సిట్ విచారణ వేస్తుందా? లేదా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

 

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×