BigTV English

Back Pain: మహిళల్లో తరచూ నడుము నొప్పి రావడానికి కారణాలివేనట !

Back Pain: మహిళల్లో తరచూ నడుము నొప్పి రావడానికి కారణాలివేనట !

Back Pain: నడుము నొప్పితో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. అయితే.. కొంతమందిలో రాత్రిపూట నిద్రపోయేటప్పుడు లేదా నిద్రలో ఉన్నప్పుడు న. ఇది నిద్రకు ఆటంకం కలిగించడమే కాకుండా.. వారి రోజువారీ పనులపై కూడా ప్రభావం చూపుతుంది. ఇంతకీ మహిళల్లో రాత్రిపూట నడుము నొప్పి ఎందుకు వస్తుంది ? దీనికి కారణాలు ఏమిటి ? అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కారణాలు:
కండరాల ఒత్తిడి : పగటిపూట ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం, బరువులు ఎత్తడం, లేదా కండరాలకు అలవాటు లేని వ్యాయామాలు చేయడం వల్ల నడుములోని కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి రాత్రిపూట పడుకున్నప్పుడు మరింత స్పష్టంగా, నొప్పి రూపంలో బయటపడుతుంది.

సరైన భంగిమ లేకపోవడం: పడుకునే భంగిమ కూడా నడుము నొప్పికి ఒక ముఖ్య కారణం. వెల్లకిలా పడుకునేటప్పుడు వెన్నెముకపై ఒత్తిడి పడకుండా ఉండాలంటే, మోకాళ్ల కింద చిన్న దిండు పెట్టుకోవడం మంచిది. అలాగే.. ఒక వైపు తిరిగి పడుకునేటప్పుడు కాళ్ళ మధ్య దిండు పెట్టుకోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది. దీనివల్ల నొప్పి తగ్గుతుంది.


పాత పరుపు : మీరు పడుకునే పరుపు చాలా మృదువుగా లేదా చాలా గట్టిగా ఉన్నప్పుడు వెన్నెముకకు సరైన ఆధారం లభించదు. ఇది నడుములోని కండరాలపై ఒత్తిడిని పెంచి నొప్పికి కారణమవుతుంది. పరుపు చాలా కాలం వాడిన తర్వాత దాని సహజత్వం కోల్పోయి మధ్యలో కుంగిపోవడం వల్ల కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది.

పీరియడ్స్: చాలామంది మహిళలకు పీరియడ్స్ సమయంలో నడుము నొప్పి రావడం సహజం. ఈ సమయంలో విడుదలయ్యే హార్మోన్లు, గర్భాశయం సంకోచించడం వల్ల నడుము కింది భాగంలో నొప్పి వస్తుంది. ఇది రాత్రిపూట మరింత ఇబ్బందికరంగా మారుతుంది.

గర్భం : గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. పెరిగే గర్భాశయం, బరువు వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే.. గర్భధారణ సమయంలో విడుదలయ్యే కొన్ని హార్మోన్లు కీళ్ళు, కండరాలను సడలించడం వల్ల కూడా నొప్పి వస్తుంది.

ఎండోమెట్రియోసిస్ : ఇది మహిళల్లో కనిపించే ఒక సాధారణ వ్యాధి. గర్భాశయం వెలుపల కణజాలం పెరగడం వల్ల కటి ప్రాంతంలో, నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో, ఇది రాత్రిపూట కూడా వేధిస్తుంది.

మూత్రనాళ సంబంధిత సమస్యలు: మూత్రపిండాలలో రాళ్ళ వంటి సమస్యల వల్ల కూడా నడుము వెనుక భాగంలో నొప్పి రావచ్చు. ఈ నొప్పి పడుకున్నప్పుడు మరింత స్పష్టంగా తెలుస్తుంది.

Also Read: ఆలస్యంగా నిద్ర పోతున్నారా ? డేంజర్‌లో పడ్డట్లే !

నివారణ, ఉపశమనం:
సరైన పరుపును ఎంచుకోండి: వెన్నెముకకు సరైన ఆధారం ఇచ్చే పరుపును వాడాలి.

పడుకునే తీరు మార్చండి: వెల్లకిలా పడుకునేటప్పుడు మోకాళ్ల కింద దిండు, ఒక వైపు తిరిగి పడుకునేటప్పుడు కాళ్ల మధ్య దిండు పెట్టుకోవాలి.

వెచ్చని కాపడం: రాత్రి పడుకునే ముందు నడుముపై వేడి నీటి సంచి లేదా వేడి కాపడం పెట్టుకోవడం వల్ల కండరాలు సడలి నొప్పి తగ్గుతుంది.

తేలికపాటి వ్యాయామాలు: వెన్నెముకను బలోపేతం చేసే తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగా వంటివి క్రమం తప్పకుండా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Related News

Poha Recipe:10 నిమిషాల్లోనే రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. వెంటనే ట్రై చేయండి

Copper Bottle: కాపర్ బాటిల్ వాటర్ తాగారో అంతే సంగతులు, వీళ్లకు మరీ డేంజర్!

Navratri Celebration: ఆఫీసులో దేవీ నవరాత్రులు.. ఇలా జరుపుకుంటే ఎప్పటికీ మరచిపోలేరు

High Protein Food: ఎగ్స్‌కు బదులుగా ఇవి తింటే.. ఫుల్ ప్రోటీన్

Eyesight: ఇలా చేస్తే.. కంటి అద్దాల అవసరమే ఉండదు తెలుసా ?

Fatty Liver Food: ఫ్యాటీ లివర్ సమస్యా ? ఇవి తింటే ప్రాబ్లమ్ సాల్వ్

Masala Tea: ఒక కప్పు మసాలా టీతో.. ఇన్ని ప్రయోజనాలా ?

Cardamom Benefits:రాత్రి భోజనం తర్వాత ఈ ఒక్కటి తింటే చాలు.. వ్యాధులు రమ్మన్నా రావు !

Big Stories

×