Viksit Bharat Rozgaar Yojna: దేశంలో యువతపై వరాల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై శుక్రవారం ఉదయం మాట్లాడిన ప్రధాని, యువతకు వరాల జల్లు కురిపించారు. ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా లక్ష కోట్ల విలువైన వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రకటించారు. 2047 నాటి లక్ష్యాలు చేరుకోవాలంటే యువతకు మరింత ప్రోత్సాహం ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి యువతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు లక్ష కోట్ల వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి జులై 31, 2027 వరకు అంటే రెండేళ్లు అమలులో ఉంటుంది.
ఈ పథకం ద్వారా మూడున్నర( 3.5) కోట్ల యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆ లెక్కన దాదాపు 1.92 కోట్ల మంది మొదటిసారి ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించనున్నారు. మొదటిసారి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందిన యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి 15 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనుంది.
ఈ మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించనున్నారు. ఉద్యోగంలో జాయిన్ అయిన 6 నెలల తర్వాత తొలి వాయిదా చెల్లించనున్నారు. ఏడాది తర్వాత ఆర్థిక సాక్షరత కార్యక్రమం పూర్తి చేసినవారికి రెండో వాయిదా చెల్లిస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్-ABPS ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్-DBT రూపంలో అందజేయనుంది.
ALSO READ: ఎర్రకోటపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, సోషల్ మీడియాపై దృష్టి
యువతలో ఆర్థిక సాక్షరతను పెంపొందించడంతోపాటు సొమ్మును స్థిర ఆదాయ సాధనలో ఉంచి విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని అందించనుంది. వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని రెండు భాగాలుగా విభజించారు ప్రధాని మోడీ. తొలుత కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినవారిపై దృష్టి సారిస్తుంది.
వారంతా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFOలో నమోదు చేసుకొని ఉండాల్సిందే. నెల జీతం లక్షకు మించకూడదు. రెండోది యజమానులకు సంబంధించినది. కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రోత్సాహకాలను కేంద్రం అందించనుంది.
50 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు కనీసం రెండు అదనపు ఉద్యోగులను నియమించాలి. 50 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు కనీసం ఐదు అదనపు ఉద్యోగులను నియమించుకోవాలి. యజమానులకు నెలకు 3 వేలు చొప్పున రెండేళ్లపాటు ప్రొత్సాహకాలు ఇవ్వనుంది. తయారీ రంగంలో అయితే మూడు, నాలుగో ఏడాది కూడా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
దేశ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
రూ. లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్న మోదీ
ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరపున నెలకు రూ.15 వేలు అందించనున్నట్లు ప్రకటన
ఈ ప్రణాళికను ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన కింద అమలు… pic.twitter.com/yzfMsC63UO
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2025