OG Movie: ‘హరిహర వీరమల్లు’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న మరో చిత్రం ‘ దే కాల్ హిమ్: ఓజీ’.. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా వస్తున్న ఈ చిత్రానికి సుజీత్(Sujeeth ) దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా.. ప్రీమియర్ షో కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 24వ తేదీన రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలు పడుతున్నట్లు.. అటు తెలంగాణలో అదే రోజు రాత్రి 9 గంటలకే ప్రీమియర్ షోలు పడనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ఆంధ్రాలోని పలు ఏరియాలలో టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఓజీ ఓవర్సీస్ కంటెంట్ ఇంకా డెలివరీ చేయలేదట. చివరి నిమిషంలో ఈ విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనుకున్న సమయానికి అటు ట్రైలర్ ని కూడా విడుదల చేయలేదు. దీనికి తోడు ఇప్పుడు కంటెంట్ కూడా అప్లోడ్ కాలేదు అని తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున డైరెక్టర్ పై మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
ఈ విషయం తెలియడంతో.. ఇటు విడుదలకు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. కంటెంట్ అప్లోడ్ అయ్యేదెప్పుడు? ఓవర్సీస్ అన్ని ఏరియాలకు వెళ్ళేది ఎప్పుడు? షోస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? ఇలా పలు రకాల అనుమానాలు ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ కే కంటెంట్ అప్లోడ్ కాలేదు అంటే ఇక దాదాపు ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినట్లే. ఇక ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అవడం అటు ఉంచితే.. మొదటిరోజు చాలా షోస్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇదే జరిగితే మొదటి రోజు 100 కోట్ల మార్క్ అసాధ్యం..
ఒకవేళ ఇదే జరిగితే మొదటి రోజు 100 కోట్ల మార్క్ టచ్ చేయడం అసాధ్యం అని చెప్పడంలో సందేహం లేదు. తీరా టైం దగ్గర పడిన తర్వాత ఇలాంటి షాక్ ఇవ్వడంతో అభిమానులు టీమ్ పై మండిపడుతున్నారు. చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చేలా ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సమయంలో కంటెంట్ అప్లోడ్ చేయకపోవడంతో చిత్ర బృందంపై పూర్తి వ్యతిరేకత నెలకొంటుంది. మరి సుజిత్ ఇలాంటి క్రిటికల్ సమయంలో ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలని అందరూ ఆత్రుత ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?