RGV:శివ, క్షణక్షణం, రంగీలా అంటూ అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి డైరెక్టర్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు వర్మ. అలాంటి ఈయన ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ.. అడల్ట్ కంటెంట్ తో విమర్శలు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నిజానికి వర్మ ఏం చేసినా కరెక్టే అని చెప్పే వర్గం కూడా లేకపోలేదు. అలా ముక్కుసూటి మనిషిగా పేరు సొంతం చేసుకున్న వర్మ.. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), చిరంజీవి(Chiranjeevi )కాంబినేషన్లో మూవీ వస్తే ఎలా ఉంటుంది? అనే విషయంపై ప్రస్తావించడం వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి హీరోగా వచ్చిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ సినిమా నిన్నటితో 47 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు తన అన్నయ్య కి శుభాకాంక్షలు చెబుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పోస్ట్ రాంగోపాల్ వర్మ రీపోస్ట్ చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పవన్ కళ్యాణ్ , చిరంజీవి కలయికలో మూవీ..
ఈ మేరకు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ షేర్ పోస్ట్ ను రీ పోస్ట్ చేస్తూ..” మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరిలో మెగా పవర్ జోష్ నింపుతుంది. అలా మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఈ శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుంది” అంటూ రాంగోపాల్ వర్మ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎలాంటి కథతో వస్తారు..? ఏ నిర్మాణ సంస్థ సినిమా తీస్తే బాగుంటుంది? అనే అభిప్రాయాలు నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా వర్మ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అభిమానులలో ఆలోచనలను తెప్పిస్తున్నాయి అనడంలో సందేహం లేదు.
also read:OG Movie: ఓజీ ప్రీమియర్ షోలు క్యాన్సిల్… చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చేలా ఉన్నారే
వర్మ ఆలోచనలు ఆచరణలోకి వస్తాయా?
చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమా విషయానికి వస్తే.. ఆయన నటించిన తొలి సినిమా ఇది. నిన్నటితో అంటే సెప్టెంబర్ 22 2025కి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అటు పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్య చిరంజీవిపై అభిమానం చాటుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. “చిరంజీవి పుట్టుకతోనే యోధుడు.. ఆయనకు రిటైర్మెంట్ ఉండదు” అంటూ ప్రశంసలు కురిపించారు. దానికి చిరంజీవి కూడా స్పందిస్తూ..” ఈ మాటలు నన్ను పాత రోజులకు తీసుకెళ్లాయి” అంటూ కూడా తెలపడం గమనార్హం. అలా మొత్తానికైతే చిరంజీవి, పవన్ కళ్యాణ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..ఈ ఇద్దరినీ కలిపి ఒకే తెరపై చూడాలని ఉంది అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి వర్మ కోరిక మేరకు.. పవన్ కళ్యాణ్, చిరంజీవి కోసం ఎవరైనా ఒక గొప్ప డైరెక్టర్ ముందుకు వస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది వర్మ ఆలోచనలు ఆచరణలోకి వస్తాయా అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
And you both will be doing the entire telugu people of the world a MEGA POWER favour, if you do a film together , and that will be the MEGA POWER film of the CENTURY 💪 https://t.co/BgrrCzTnC8
— Ram Gopal Varma (@RGVzoomin) September 22, 2025