Bigg Boss 9:రీతూ చౌదరి (Rithu Chowdhary) .. సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత జబర్దస్త్ (Jabardasth) కామెడీ షోలోకి వచ్చి అక్కడ ఒక గుర్తింపును అందుకొని.. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయింది రీతు చౌదరి. ఆ తర్వాత మనీ ల్యాండరింగ్ కేసులో ఇరుక్కోవడం, భర్తకు విడాకులు ఇవ్వడం అన్ని కూడా రెప్పపాటులో జరిగిపోయాయి. దీనికి తోడు బెట్టింగ్ యాప్ కేసులో కూడా ఇరుక్కొని వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ ఇక అన్నీ సద్దు మణిగాయి అనుకునే లోపే.. ఇప్పుడు ఏకంగా ఎఫైర్ ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనంగా మారింది.
రీతూ చౌదరి బండారం బయటపెట్టిన ధర్మా మహేష్ భార్య..
ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేయకుండా.. కామనర్ డెమోన్ పవన్, సోల్జర్ పవన్ కల్యాణ్ లతో ట్రాక్ నడుపుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె పై ఇప్పుడు హీరో ధర్మా మహేష్ (Dharma Mahesh) భార్య గౌతమి చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు రాత్రుళ్ళు మాత్రమే మా ఫ్లాట్ కి వస్తుంది.. తన భర్తతో బెడ్ రూమ్ కి వెళ్తోంది అంటూ గౌతమి కామెంట్లు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది గౌతమి. దీంతో ఎక్కడ చూసినా రీతు చౌదరిపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత నెలకొంది అని చెప్పవచ్చు.
బిగ్ బాస్ నుంచి డైరెక్ట్ ఎలిమినేషన్ తప్పదా?
ఇకపోతే రెండేళ్ల క్రితమే ఈ వ్యవహారం జరిగినా.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో రీతూ చౌదరి ఉంది కాబట్టి కరెక్ట్ టైం చూసి గౌతమి ఇవన్నీ బయట పెట్టిందని రీతు అభిమానులు గౌతమీపై ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్నో కేసుల్లో ఇరుక్కున్న ఈమె ఇప్పుడు ఎఫైర్ వార్తల్లో కూడా నిలవడంతో ఈమెను హౌస్ లో ఇంకా కొనసాగిస్తే బిగ్ బాస్ బ్రాండ్ పడిపోతుందని మేనేజ్మెంట్ భావిస్తోందట. అందుకే ఈ వారం ఈమెను ఎలిమినేట్ చేసేందుకు ప్లాన్ జరుగుతున్నట్లు సమాచారం. పైగా ఆ హౌస్ లో కూడా రీతూ పెద్దగా ఆటపై ఫోకస్ చేయకుండా సోల్జర్ కళ్యాణ్, డెమోన్ పవన్ లతో ట్రాక్ నడిపిస్తుందని.. ఇద్దరినీ వలలో పడేసి ఆటాడుతోంది కాబట్టే ఇదే మంచి టైమింగ్ అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా భావిస్తోందట. అందులో భాగంగానే ఇప్పుడు ఈమెను.. ఈ వారం చివర్లో ఓట్లతో సంబంధం లేకుండా డైరెక్ట్ ఎలిమినేట్ చేయబోతున్నట్లు సమాచారం.
ALSO READ:Kantara Chapter 1: సెన్సార్ పూర్తి చేసుకున్న కాంతార 2.. నిడివి ఎంత.. ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే?
ఎఫైర్ రూమర్స్ పై స్పందిస్తుందా?
ఏది ఏమైనా గౌతమి దెబ్బకు రీతూ చౌదరి ఇప్పుడు ఉన్నఫలంగా హౌస్ నుంచి బయటకు రాబోతోంది అని తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే ఇది జరిగితే రీతు చౌదరి ఆ తర్వాత జరగబోయే పరిస్థితులపై ఎలా స్పందిస్తుందో చూడాలి. అంతేకాదు ఎఫైర్ రూమర్స్ పై కూడా ఆమె స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.