OM Shanti Release Date: దర్శకుడు తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) అంటే పరిచయాలు అక్కర్లేని పేరు. అయితే ఈయన పేరుకు ఎందుకంత పాపులారిటీ అంటే ఫస్ట్ సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇక ఆ సినిమానే ‘పెళ్లి చూపులు’..విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన పెళ్లి చూపులు సినిమాకి డైరెక్టర్ ఎవరో కాదు తరుణ్ భాస్కర్. అలా మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న తరుణ్ భాస్కర్ మీద ఇండస్ట్రీలో మంచి హోప్స్ పెరిగాయి. కానీ చివరికి తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ నటుడిగా మారిపోయారు.
నటుడిగా మారిన తరుణ్ భాస్కర్..
మీకు మాత్రమే చెబుతా (Meeku Matrame Chebutha) అనే సినిమాలో హీరోగా కూడా నటించారు.అయితే తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా మరో సినిమా రాబోతోంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్. మరి ఇంతకీ తరుణ్ భాస్కర్ నటించిన సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? దాని విశేషాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మరో కొత్త మూవీ తో రాబోతున్న 35 మూవీ మేకర్స్..
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా (Easha Rebba) ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా మూవీ ఓం శాంతి శాంతి శాంతిః.. ఈ సినిమాకి ఏఆర్ సంజీవ్ (Ar Sanjeev) దర్శకత్వం వహించగా.. నివేదా థామస్ (Niveda Thomas) కీలక పాత్రలో ’35 :ఇది చిన్న కథ కాదు ‘ సినిమాను నిర్మించిన.. యస్ ఒరిజినల్ (S Original), మూవీ వెర్స్(Movie Verse) అనే మూవీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర యూనిట్.
రిలీజ్ డేట్ ఫిక్స్..
ఆగస్టు 1న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇందులో తరుణ్ భాస్కర్ హీరోగా.. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించగా ఒక పల్లెటూర్లో జరిగే పోరాటాలు, కోడిపందాలు వంటి వాటి గురించి సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అంబటి ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్, కొండవీటి ప్రశాంతి పాత్రలో ఈషా రెబ్బా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఓం శాంతి శాంతి శాంతిః(Om Shanti Shanti Shantihi) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.
ఆకట్టుకుంటున్న పోస్టర్..
ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ పోస్టర్లో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో రెండు చేతులతో పోస్టర్ రిలీజ్ చేశారు. అలా మరికొద్ది రోజుల్లో తరుణ్ భాస్కర్ కొత్త సినిమాతో అలరించబోతున్నారు.
తరుణ్ భాస్కర్ సినిమాలు..
ఇక తరుణ్ భాస్కర్ సినిమాల విషయానికొస్తే..ఆయన పెళ్లిచూపులు సినిమా(Pelli Choopulu Movie) కంటే ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకొని పెళ్లిచూపులు మూవీతో డైరెక్టర్ గా మారారు.ఈ సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది(E Nagaraniki Emaindi),కీడా కోలా (Keeda Kola) వంటి సినిమాలకు డైరెక్షన్ వహించారు.అలాగే సీతారామం (Sitaramam), మిడిల్ క్లాస్ మెలోడీస్(Middle Class Melodies), మహానటి(Mahanati) వంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.
also read:NTR War 2 : వార్ 2 పై నాగ వంశీ బిగ్ అప్డేట్.. మూడో బ్లాక్ బస్టర్ అంటూ వీడియో రిలీజ్!