Big TV Kissik Talks: సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది విపరీతంగా ఫేమస్ అయ్యారు. కొందరు వాళ్ళ టాలెంట్ ఉపయోగించి సినిమాల్లో అవకాశాలు కూడా పొందుకున్నారు. ఇంకొంతమంది బిగ్ బాస్ వంటి రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపును సాధించుకున్నారు. అలా ఎంతోమంది సాధించుకున్న కూడా విన్నర్ గా మాత్రం పేరు సాధించింది పల్లవి ప్రశాంత్.
రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత షోలో కొద్దిపాటి నెగిటివిటీని ఎదుర్కొన్నాడు. మొత్తానికి బిగ్బాస్ టైటిల్ అయితే గెలిచాడు. ఆ తరువాత అతని మీద పలు రకాల కామెంట్స్ కూడా వచ్చాయి. గెలిచిన తర్వాత ట్రాఫిక్ కి అంతరాయం కలిగించాడు అంటూ తన మీద కేసు కూడా ఫైల్ చేశారు. జైల్లో నాలుగు రోజులు గడిపాడు పల్లవి ప్రశాంత్.
జైల్లో నాలుగు రోజులు
జైలు అనుభవాన్ని బిగ్ టీవీకి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించటం, జైలు కూడు తినడం తలపై రాసిపెట్టు ఉంది. జీవితంలో నాకు బాధనిపించింది ఏంటి అని అంటే మా నాన్నని కోర్టు మెట్లు దగ్గర చూడటం. అది ఎప్పటికీ నాకు చాలా బాధగా ఉంటుంది. బాపు అమ్మకు చెప్పు నేను ఏ తప్పు చేయలేదు మళ్లీ వచ్చేస్తాను అని. అలానే తన లైఫ్ లో ఉన్న కష్టాలు అన్నిటిని బిగ్ టీవీ కిషిక్ టాక్ షోలో పంచుకున్నాడు.
చాలామందికి సాయం
చాలామంది గెలిచిన డబ్బులు రైతులకు ఇస్తాను అని చెప్పాడు ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అనే ప్రశ్నకు, నేను అవి మాత్రమే కాకుండా ఏవైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తుంటే ఆ వచ్చే డబ్బులతో కూడా కొంతమందిని చదివిస్తున్నాను. అలానే ఒక అమ్మాయి మాకు సపోర్ట్ చేయండి చదువుకుంటాను అంటే నేను సపోర్ట్ చేశాను. అమ్మాయి నీ దయవల్ల కాలేజ్ ఫస్ట్ వచ్చానన్నా అంటూ నా దగ్గరికి వచ్చి చెప్పింది. నా దయ ఏమీ లేదమ్మా అంటూ చెప్పాను. అంటూ ప్రశాంత్ తెలిపాడు. అలానే తనను కావాలని కొంతమంది టార్గెట్ చేస్తున్నారు అంటూ వాపోయాడు. ప్రస్తుతం ఎవరైతే బిగ్ బాస్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేశాడు. ప్రయత్నాన్ని మాత్రం వదలొద్దు అంటూ పల్లవి ప్రశాంత్ ఈ షోలో పలు రకాల అంశాలను ప్రస్తావించాడు.
Also Read: Gowtham Tinnanuri : ఒక లవ్ స్టోరీ చేస్తా, మళ్ళీ తన బలన్నే నమ్ముకుంటున్నాడా ?