Megastar Chiranjeevi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్దాలుగా స్టార్ అంటే వినిపించే పేరు మెగాస్టార్. మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి అంటేనే చాలామందికి ఒక ఎనర్జీ వస్తుంది. చిరంజీవిని చూసి నటులు అవ్వాలని వచ్చిన వాళ్ళు కొంతమంది, చిరంజీవిని వాళ్లు ఎలా చూపించాలో అని నిర్ణయించుకొని దర్శకుడు అవ్వాలనుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది.
ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి అంటేనే చాలామందికి ఇన్స్పిరేషన్. ప్రస్తుతం కూడా చాలామంది యంగ్ హీరోలకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఆ ఈవెంట్ లో మెగాస్టార్ స్టెప్పులు
రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ నిర్వహించింది. ఆ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టెప్పులేసారు. చామంతి పువ్వా అనే పాటకు తన గ్రేస్ చూపించారు. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ చూస్తుంటే, ఇది కథ బాస్ అంటే అనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ఆ ప్రముఖ ఛానల్ ఆ వీడియోను రిలీజ్ చేస్తుంది. అయితే ఈలోపే మెగాస్టార్ స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
గ్రేస్ తగ్గలేదు బాస్
మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడాల్సి వస్తే మొదట చర్చించుకోబోయే అంశం డాన్సులు. ఎంతోమంది స్టార్ హీరోలు డాన్సులు వేసినా కూడా మెగాస్టార్ చిరంజీవి డాన్స్ వేస్తే ఆ బ్యూటీ వేరేలా ఉంటుంది. మెగాస్టార్ కాళ్లు మాత్రమే కాదు, కళ్ళు కూడా డాన్స్ చేస్తాయి. ఒక తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో వేసే డాన్సులు కోసమే థియేటర్కు వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. రీసెంట్ టైమ్స్ లో మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ కు పని చెప్పే పాటలు రావట్లేదు. ఒకవేళ అదే క్రియేట్ చేయగలిగితే మెగాస్టార్ చిరంజీవి ఎనర్జీ ఏంటో మరోసారి రుజువు అవుతుంది. బాస్ ను అంత ఎనర్జీగా చూస్తుంటే ఏజ్ ఏజ్ జస్ట్ నెంబర్ అనిపించక మానదు.
Also Read: Big TV Kissik Talks: నాకు ఇప్పటికే ఆ బాధ ఉంది, కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్