Gowtham Tinnanuri : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ శాతం లవ్ స్టోరీ సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ సినిమాలను కూడా ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి లవ్ స్టోరీ లో ప్రేమించుకోవడం విడిపోవడం కామన్ అయినా కూడా, కొన్ని మూమెంట్స్ చాలా అందంగా ఉంటాయి. అందుకోసమే లవ్ స్టోరీ కి ఎక్కువమంది కనెక్ట్ అవుతారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది సాధారణంగా ఉంటూనే ఉంటుంది. ప్రేమ అనేది ఒక కామన్ ఎమోషన్, అందుకే ఎక్కువమంది తెలుగు దర్శకులు లవ్ స్టోరీ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా మళ్లీ రావా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గౌతం. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ లవ్ స్టోరీ డీసెంట్ హిట్ గా నిలిచింది. సుమంత్ కెరియర్ లో ఉన్న బెస్ట్ ఫిలిమ్స్ లో మళ్ళీ రావా కూడా ఒకటి అని చెప్పాలి.
లవ్ స్టోరీ చేస్తా
ఇక గౌతం తిన్న నూరి రీసెంట్ గా కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఒకటి చేయనున్నారు. అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సంవత్సరాలు వేరే ప్రాజెక్టులు మీద బిజీగా ఉన్నాడు. అందుకే ఈలోపు ఒక లవ్ స్టోరీ సినిమా చేసే ఆలోచన ఉన్నట్లు గౌతం తిన్ననూరి తెలియజేశాడు. గౌతమ్ లవ్ స్టోరీ ఎంత బాగా రాస్తాడో మళ్లీ రావా సినిమా చూస్తే మనకు అర్థమయిపోతుంది. అయితే కింగ్డమ్ విషయంలో చాలామందికి కొద్దిపాటి అసంతృప్తి ఉంది. తన జోనర్ కాకుండా సినిమా చేయడం వలనే ఇలా జరిగింది అనే రిలైజేషన్ గౌతమ్ కి కూడా వచ్చి ఉంటుంది. అందుకే ఈ లోపు మరోసారి ఒక లవ్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.
రామ్ చరణ్ తో వర్కౌట్ అవుతుందా.?
గతంలో వార్తలు వినిపించినప్పుడు రామ్ చరణ్ హీరోగా లవ్ స్టోరీ చేస్తాడు అని కూడా వినిపించింది. ఒకవేళ అదే నిజమైతే చరణ్ కి అది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. ఆరెంజ్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ చరణ్ ఒక్క లవ్ స్టోరీ సినిమా కూడా చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఒక లవ్ స్టోరీ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్స్ వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు చరన్ సుకుమార్ సినిమాతో బిజీ అయిపోతాడు కాబట్టి అది సాధ్యమయ్యే అవకాశం లేదు. ఏదైనా రెండు సంవత్సరాలు లోపే సినిమాను పూర్తి చేయాలి కాబట్టి వేరే హీరోతో గౌతమ్ వెళ్ళే అవకాశం ఉంది. కింగ్డమ్ గ్యాప్ లో గౌతమ్ మ్యాజిక్ అనే ఒక సినిమాను కూడా పూర్తి చేశాడు. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయింది. త్వరలో అది రిలీజ్ కానుంది.
Also Read: Lokesh Kanakaraj : నేను నాగర్జున ని చూసి ఫంక్ పెంచాను, రజినీకాంత్ సార్ చాలా నేర్పించారు