BigTV English

Panchayat Actor: పంచాయత్ నటుడికి గుండెపోటు.. ఫ్యాన్స్ ఆందోళన పై నటుడు క్లారిటీ!

Panchayat Actor: పంచాయత్ నటుడికి గుండెపోటు.. ఫ్యాన్స్ ఆందోళన పై నటుడు క్లారిటీ!

Panchayat Actor:ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు కెరియర్ పై ఫోకస్ పెడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులను మెప్పించడానికి.. సినిమాలతో సక్సెస్ అందుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి బాలీవుడ్ ‘పంచాయత్’ వెబ్ సిరీస్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఆసిఫ్ ఖాన్ (Asif Khan) కూడా చేరిపోయారు.


పంచాయత్ నటుడికి గుండెపోటు..

పంచాయత్ వెబ్ సిరీస్ తో నటుడిగా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న ఆసిఫ్ ఖాన్.. గత రెండు రోజుల క్రితం గుండెపోటు బారిన పడ్డ విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చేర్చారు. ఇక ఆయన చికిత్స పొందుతున్నారు అని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. కొన్ని రోజుల్లో డిస్చార్జ్ అవుతారని బాలీవుడ్ సినీ వర్గాలు కూడా వెల్లడించాయి.


జీవితం చాలా చిన్నది.. హితబోధ చేసిన నటుడు..

హాస్పిటల్ నుండి ఆసిఫ్ ఖాన్ ఈ మేరకు ఒక పోస్ట్ పంచుకున్నారు. “36 గంటల నుంచి ఆసుపత్రి రూమ్ ఒక్కటే చూస్తున్నాను. జీవితం చాలా చిన్నది. నేను అనారోగ్యంతోనే హాస్పిటల్ లో చేరాను. ఇక్కడ ఉన్నంతసేపు హాస్పిటల్ పైకప్పు చూసుకుంటూ జీవితం ఎంత చిన్నదో గ్రహించాను. అందుకే జీవితంలో ఏదీ కూడా అంత తేలికగా తీసుకోకండి. ఒక్క క్షణంలో అన్నీ మారిపోతాయి. మీకు మీరు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండండి. ముఖ్యంగా మీకు మీ జీవితంలో ఎవరు ముఖ్యంగా అనిపిస్తారో వారితోనే హ్యాపీగా ఉండండి. నేను త్వరలోనే తిరిగి వస్తాను. అప్పటివరకు నన్ను మీ ఆలోచనల్లో ఉంచుకున్నందుకు ధన్యవాదాలు” అంటూ తన పోస్ట్ ద్వారా జీవిత సత్యాన్ని తెలిపారు ఆసిఫ్ ఖాన్.

గుండెపోటుపై క్లారిటీ ఇచ్చిన నటుడు..

ఇకపోతే ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా.. తాజాగా డిశ్చార్జ్ అయిన ఆసిఫ్ ఖాన్ తనకు గుండెపోటు అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు.. తాజాగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ఆసిఫ్ ఖాన్ మాట్లాడుతూ..” ఇది గుండెపోటు కాదు. ఇది గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి. దీని లక్షణాలు గుండెపోటు లాగే అనిపించాయి. కానీ నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఎప్పుడూ గుండెపోటు రాలేదు” అని స్పష్టం చేశారు. మొత్తానికైతే పంచాయత్ నటుడికి గుండెపోటు అంటూ వస్తున్న వార్తలపై ఆయనే స్వయంగా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఆసిఫ్ ఖాన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు..

ఆసిఫ్ ఖాన్ విషయానికి వస్తే.. పంచాయత్ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన మీర్జాపూర్, జమ్తారా, పాతాల్ లోక్, దేహతి లడ్కే వంటి సినిమాలు చేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాగే ది ఇండియన్ గ్రేట్ ఫ్యామిలీ, కాకుడ, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, పారి వంటి చిత్రాలు కూడా చేశారు.

ALSO READ:Soundarya Birth anniversary: ఆమె ఓ కెరటం.. చనిపోయి 22 ఏళ్లు అవుతున్నా తగ్గని క్రేజ్!

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×