Bollywood Actress : సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందులో కొంతమంది ప్రేమలో ఉండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి వారిలో గోవా బ్యూటీ ఇలియానా పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. తెలుగు హీరోయిన్లు మాత్రమే కాదు అటు బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది. చాలామంది హీరోయిన్లు పెళ్లి కాకుండానే తల్లి ఆ తర్వాత పెళ్లికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.. బాలీవుడ్ ఇండస్ట్రీలో సీరియల్స్ లో హీరోయిన్గా నటించిన హీనా ఖాన్ ప్రెగ్నెంట్ అంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. అయితే ఆమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
బాయ్ ఫ్రెండ్ తో 13 ఏళ్లు డేటింగ్..
సీరియల్ హీరోయిన్ హీనా ఖాన్ 2024 జూన్ నుంచి స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం, కోలుకోవడంపైనే దృష్టిపెట్టింది. పది రోజులుగా ఆమె ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటుంది.. ఇటీవలే ఆమె కోల్కుంటున్నట్లు వార్తలు కూడా బాలీవుడ్ మీడియాలో వినిపించాయి. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అన్న వార్తలు మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. నిజానికి పదమూడేళ్ల డేటింగ్ తర్వాత ఈ ఏడాది జూన్ 4న తన లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్‌ను పెళ్లి చేసుకుంది హీనా. ఇక్కడి వరకు బాగానే ఉన్నా తాజాగా మీడియాకు కనిపించిన ఆమె పొట్ట కాస్త ఎత్తుగా ఉండటంతో.. ప్రెగ్నెన్సీ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.. ఆమె ప్రెగ్నెంట్ అవడంతోనే త్వరగా చెడి చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందంటూ మరో వార్త ప్రచారంలో ఉంది. అయితే డ్రెస్ కారణంగా అలా కనిపించిందని.. హ్యాపీగా ఉంటున్న సమయంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టొద్దని సూచిస్తున్నారు అభిమానులు.. ఏమైనా కూడా ఈ వార్త మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..
Also Read:యూట్యూబర్ పూలచొక్కా అరెస్ట్.. రివ్యూల కోసం 40 వేలు అడిగాడా ?
హీనా ఖాన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..
బాలీవుడ్ ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీనా ఖాన్, రాకీ జైస్వాల్ 2014 నుంచి డేటింగ్ చేస్తున్నారు. తన విజయాల్లోనే కాకుండా కష్టాల్లోనూ ఆమెకు రాకీ అండగా ఉన్నాడు. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమెకు సపోర్ట్‌గా నిలబడ్డాడు. అయితే కొద్ది రోజులుగా సీరియల్స్ లలో కనిపించలేదు. దాంతో ఆమెకు ఏమైందో తెలియదు కానీ రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. క్యాన్సర్ గురించి ఆమె బయటపెట్టి ప్రస్తుతం కోలుకుంటున్నాను అంటూ పోస్టులు పెట్టడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం .. బేబీ బంప్ తో ఉంది అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే ప్రగ్నెంట్ నో కాదో తెలియాలంటే ఆమె క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..