Realme GT 8 Pro vs OnePlus 15 vs Oppo Find X9 Comparison | ఇండియాలో ఇటీవలే తక్కువ వ్యవధిలో మూడు సూపర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. మూడు ఫోన్లు డిస్కౌంట్ ఆఫర్లతో దుమ్ము రేపుతున్నాయి. ఈ వారమే లాంచ్ అయిన Realme GT 8 Proకు కొన్ని రోజుల క్రితం లాంచ్ అయింది. ఈ ఫోన్ OnePlus 15, Oppo Find X9 తో పోటీ పడుతోంది. మూడూ టాప్ లెవెల్ పవర్, అద్భుతమైన ఫీచర్లు ఇస్తున్నాయి. ఏది మీకు బెస్ట్ అని తెలుసుకోవాలంటే ఫీచర్లు పోల్చి చేద్దాం!
రియల్ మి GT 8 Pro: బేస్ మోడల్ (12GB RAM + 256GB) ధర రూ.72,999. టాప్ వేరియంట్ (16GB + 512GB) ధర రూ.78,999.
OnePlus 15: బేస్ మోడల్ రూ.72,999 (12GB + 256GB), హయ్యర్ వేరియంట్ రూ.79,999.
Oppo Find X9: బేస్ మోడల్ రూ.74,999, టాప్ వేరియంట్ రూ.89,999 వరకు వెళ్తుంది.
రియల్ మి, OnePlus ధరలు దాదాపు సేమ్, కానీ Oppo కొంచెం ఎక్కువ.
రియల్ మి GT 8 Pro లో పెద్ద 6.79 అంగుళాల QHD+ స్క్రీన్ ఉంది, 144Hz రిఫ్రెష్ రేట్. 2000 నిట్స్ బ్రైట్‌నెస్ – గేమింగ్, వీడియోలకు సూపర్ స్మూత్!
ఒప్పో ఫైండ్ స్క్రీన్ కొంచెం చిన్నది 6.59 అంగుళాల AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే.
OnePlus 15 లో 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంది, రిఫ్రెష్ రేట్ 1 నుంచి 165Hz వరకు ఆటోమాటిక్ గా మారుతుంది – బ్యాటరీ సేవ్ అవుతుంది, చూడడానికి అదిరిపోతుంది.
రియల్‌మి GT 8 Pro, OnePlus 15 రెండూ Snapdragon 8 Elite Gen 5 చిప్‌తో వస్తున్నాయి. గేమింగ్ లో టాప్ స్పీడ్, మల్టీటాస్కింగ్ సూపర్!
వన్‌ప్లస్ ఫైండ్ X9 లో MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ఉంది. ఇది కూడా చాలా పవర్‌ఫుల్, రోజువారీ యూజ్ కి బెస్ట్.
రియల్‌మి GT 8 Pro లో ట్రిపుల్ కెమెరా – అందులో 200MP టెలిఫోటో లెన్స్ ఉంది, జూమ్ ఫోటోలు అద్భుతంగా వస్తాయి!
ఒప్పో ఫైండ్ X9 లో క్వాడ్ కెమెరా సెటప్, అన్నీ 50MP సెన్సార్లు – కెమెరా లవర్స్ కి బెస్ట్ ఛాయిస్.
వన్‌ప్లస్ 15 లో ట్రిపుల్ 50MP కెమెరాలు, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ తో OIS – జూమ్ మరియు స్టెడీ వీడియోలు సూపర్.
రియల్‌మి GT 8 Pro లో 7000mAh భారీ బ్యాటరీ, 120W వైర్డ్ + 50W వైర్‌లెస్ ఛార్జింగ్.
ఒప్పో ఫైండ్ X9 లో 7025mAh బ్యాటరీ, 80W వైర్డ్ + 50W వైర్‌లెస్.
వన్‌ప్లస్ 15 లో అతి పెద్ద 7300mAh బ్యాటరీ, 120W సూపర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ – కానీ వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు.
గేమింగ్, పెద్ద స్క్రీన్, హై రిఫ్రెష్ రేట్ కావాలంటే రియల్‌మి GT 8 Pro బెస్ట్ ఆప్షన్
బెస్ట్ కెమెరా సిస్టమ్, స్టైలిష్ డిజైన్ కావాలంటే ఒప్పో ఫైండ్ X9.
బ్యాలెన్స్‌డ్ పెర్ఫామెన్స్, భారీ బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే కావాలంటే వన్ ప్లస్15.
మూడు ఫోన్లు టాప్ క్లాస్, మీ బడ్జెట్, యూజ్ బట్టి ఏది కొనాలో నిర్ణయించుకోండి.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే