E-Paper
Advertisement

Pawan Kalyan HHVM 2 : ‘వీరమల్లు’ సీక్వెల్ పక్కన పెట్టి.. రత్నంకి మరో సినిమా చేసిపెట్టనున్న పవన్ !!

Pawan Kalyan HHVM 2 : ‘వీరమల్లు’ సీక్వెల్ పక్కన పెట్టి.. రత్నంకి మరో సినిమా చేసిపెట్టనున్న పవన్ !!
Advertisement

Pawan Kalyan HHVM 2 : దాదాపు 5 ఏళ్ళ పాటు సెట్స్ పై ఉన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ నుండి దాదాపు 2 ఏళ్ళ తర్వాత వచ్చిన సినిమా కావడం, పైగా రీ ఎంట్రీలో పవన్ కళ్యాణ్ చేసిన మొదటి స్ట్రైట్ మూవీ కావడం, అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘హరిహర వీరమల్లు’ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

అందుకే రిలీజ్ కి ముందు రోజు రాత్రి నుండి ప్రీమియర్స్ వేసి మరీ క్యాష్ చేసుకోవాలని చిత్ర బృందం భావించింది. కానీ ఆ ప్రయత్నం మొదటికే మోసం వచ్చింది. సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అభిమానులు సైతం సినిమాలో చాలా కంప్లైంట్స్ చెబుతూ బాధపడ్డారు. దర్శకుడు క్రిష్ మంచి పాయింట్ తీసుకునే సినిమాని మొదలు పెట్టారు. సగంపైనే షూటింగ్ ఆయనే పూర్తిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం.. అతనికి మరో సినిమా ఆఫర్ రావడంతో తప్పుకున్నారు.

Advertisement

ఫస్ట్ హాఫ్ బాగుంది అనే పేరు వచ్చింది. ఎందుకంటే అది క్రిష్ డైరెక్ట్ చేసిన భాగం. సెకండాఫ్ నుండి దర్శకుడు జ్యోతి కృష్ణ టేకప్ చేశారు. అతనికి మెయిన్ పాయింట్ అర్ధం కాకపోవడం వల్లో ఏమో.. సినిమాని అర్ధం చేసుకుని అసలు కథలోకి తీసుకెళ్లే క్రమంలో క్లైమాక్స్ వచ్చేసింది. దీంతో మిగతాది సెకండ్ పార్ట్ లో చూసుకుందాం అని ఎండ్ టైటిల్స్ వేసేసి జనాలపై వదిలేశారు. పోనీ సెకండాఫ్ ఏమైనా చూడటానికి ఆసక్తిగా ఉందా అంటే అదేమీ లేదు.

సంబంధం లేని సన్నివేశాలే వచ్చి వెళ్తూ ఉంటాయి. క్లైమాక్స్ లో ఓ ఫైట్ బాగున్నా. అప్పటికీ ఆడియన్స్ నీరసించిపోవడం వల్ల దానికి కనెక్ట్ కాలేదు. ఇక వి.ఎఫ్.ఎక్స్ ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2 వ రోజు నుండి కలెక్షన్స్ 70 శాతం పడిపోయాయి. సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుంది అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఇక్కడ తప్పంతా పవన్ కళ్యాణ్‌దే..! అందులో ఎలాంటి డౌట్ లేదు. అతను రాజకీయాల్లో బిజీ అయిపోయి డేట్స్ సరిగ్గా ఇవ్వలేదు. ఇలాంటి పాన్ ఇండియా సినిమాకి హీరో అన్ని రకాలుగా సహకరిస్తేనే క్వాలిటీ ఔట్‌పుట్ బయటకి వస్తుంది. పవన్ అలా చేయలేదు కాబట్టే.. సినిమా ఫలితం ఇలా ఉంది. నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ సినిమాతో రూ.90 కోట్ల వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కి వచ్చి మరీ సినిమా చూడండి అని చెప్పినా జనాలు థియేటర్లకు రావడం లేదు. ఇప్పటి రోజులు అలా ఉన్నాయి. అందుకే నిర్మాత ఏ.ఎం.రత్నంని ఆదుకునేందుకు పవన్ మరో అడుగు ముందుకు వేయబోతున్నారు అని తెలుస్తుంది. ‘హరిహర వీరమల్లు’ సీక్వెల్ ను పక్కన పెట్టేసి అతనికి మరో సినిమా చేసి పెట్టనున్నారట. స్నేహితుడు త్రివిక్రమ్ కి మంచి కథ చూడాలని చెప్పారట. ఆల్మోస్ట్ ఇది రీమేక్ అయ్యే అవకాశం ఉంది. కథ, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తారు. ఫాస్ట్ గా సినిమా కంప్లీట్ చేస్తే.. ఏ.ఎం.రత్నంకి కొంత ఒత్తిడి తగ్గుతుంది.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×