BigTV English

Movie Piracy: సినిమా పైరసీపై కఠిన నిర్ణయం.. మూడేళ్ల జైలు శిక్షతోపాటు..?

Movie Piracy: సినిమా పైరసీపై కఠిన నిర్ణయం.. మూడేళ్ల జైలు శిక్షతోపాటు..?

Movie Piracy:ఈ మధ్యకాలంలో ఒక సినిమా విడుదలయితే అది థియేటర్లో వచ్చిన ఫస్ట్ షోకే పైరసీ అయి మరీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని కొన్ని సినిమాలు అయితే సినిమా విడుదలకు ముందే పైరసీ ద్వారా బయటికి వచ్చి పెద్ద ఇష్యూ అయిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఇప్పటికే చాలా సినిమాల విషయాల్లో సినిమా తీసిన నిర్మాత(Producer)లు దీన్ని ఫేస్ చేశారు.. భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలకు కనీసం పెట్టిన పెట్టబడి అయినా రాకుండానే కొంతమంది కేటుగాళ్లు సినిమాని పైరసీ చేసి, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ కి అమ్ముకుంటున్నారు.. నిర్మాతల కష్టాన్ని నీరు గారుస్తున్నారు.. ఎంతో బడ్జెట్ పెట్టి ఎన్నో ఆశలతో లాభాలు వస్తాయి అని నిర్మాతలు సినిమాలు తీస్తే.. ఆ సినిమాలను పైరసీ చేసి వారి ఆశలను అడియాశలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు.


సినిమా పైరసీపై కేంద్రం కఠిన నిర్ణయం..

అయితే అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తాజాగా ఒక కఠిన చట్టం తీసుకొచ్చింది. ఇలా సినిమాని పైరసీ చేసే వారికి శిక్ష మరింత కఠినతరం చేసింది. మరి ఇంతకీ సినిమాని పైరసీ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న శిక్ష ఏంటి..? సినిమాలు పైరసీ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా బుద్ధి చెప్పబోతుంది? అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా పైరసీ రక్కసిని ఉపక్రమించేందుకు చాలా సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రత్యేక దృష్టి సారిస్తూనే ఉంది. కానీ ప్రతిసారి పైరసీగాళ్లు సినిమాలను పైరసీ చేసి నిర్మాతలకు ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటినుండి పైరసీ గాళ్లను ఏరివేసే ప్రక్రియ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు ఇలాంటి పైరసీ చేసే వారిపై ఉక్కు పాదం మోపింది.


3 ఏళ్ల జైలు శిక్ష తో పాటూ..

తాజాగా సినిమా పైరసీని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరించింది. ఇప్పటినుండి ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా సినిమాలను ప్రసారం చేసినా,రికార్డు చేసినా సరే మూడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు నిర్మాణ వ్యయంలో 5% వరకు జరిమానా కట్టాల్సిందే.అంటూ కఠిన శిక్ష విధించింది. అయితే గతంలో సినిమాని పైరసీ చేసిన నేరం కింద మూడు నెలల జైలు శిక్ష అలాగే రూ.3 లక్షల జరిమానా ఉండేది. కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని సవరిస్తూ మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు సినిమా నిర్మించిన వ్యయంలో ఐదు శాతం జరిమానా కట్టాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని తాజాగా ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్.మురుగన్(L. Murugan) వెల్లడించారు. దీంతో సినిమాలను పైరసీ చేసే వాళ్ళకి గట్టి షాక్ తగిలినట్టు అయింది. మరి ఇక్కడితోనైనా సినిమాలను పైరసీ చేసి అమ్ముకుంటున్న ఆకతాయిలకు బుద్ధి వస్తుందా.. ? అక్రమ విక్రయాలకు తెర పడుతుందా? లేదా? అనేది చూడాలి.

కేంద్రం నిర్ణయం పై సినీ నిర్మాతలు హర్షం..

అయితే సినిమాలను పైరసీ చేసే పైరసీగాళ్ల వల్ల 2023 నుండి ఇప్పటివరకు దాదాపు రూ.22,400 కోట్ల మేరా నష్టం వాటిల్లింది అంటూ ఎల్. మురుగన్ స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం పైరసీ చేసేవాళ్ళ కోసం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం బాగుందని సినీ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:War 2: తెలుగు రాష్ట్రాలలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. ఎప్పుడంటే?

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×