Intinti Ramayanam Today Episode September 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో అందరు సంతోషంగా పూజలో కూర్చుంటారు. పూజ జరుగుతున్న సందర్భంలో పోలీసులు ఇంటికి రావడం చూసి అందరూ షాక్ అవుతారు.. శ్రీకర్ ఒకతని బెదిరించి మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారంటూ పోలీసులు అతని అదుపులోకి తీసుకుంటారు.. అవని రాజేంద్రప్రసాద్ అందరూ ఎంత చెప్పినా సరే వినకుండా అతని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే పోలీసులు శ్రీకర్ ను తీసుకెళ్లడం అందరూ షాక్ అవుతారు. శ్రీకర్ వెళ్లడం అందరికీ షాక్ గా అనిపిస్తే శ్రేయ మాత్రం నా భర్త లాంటి వాడు కాదు అని పోలీసులు వెంటపడుతుంది. నా భర్త దగ్గర గన్ లైసెన్స్ కూడా లేదండి ఎలా బెదిరిస్తారు నేను చెప్పేది వినండి అని ఎంత బ్రతిమలాడినా పోలీసులు వినకుండా కోర్టులో తేల్చుకోండి అమ్మ అని శ్రీకర్ ను తీసుకొని వెళ్తారు. శ్రేయ మాత్రం నేను ఇంట్లోకి రాను ఇక్కడే ఉంటాను.. నేను ఏడుస్తూ ఉంటే మీరందరూ పూజ చేసుకుంటారా అని బాధపడుతుంది. ఇదంతా జరగడానికి అవనినే కారణమని నానా మాటలు అంటుంది. అవని ఎలాగైన నా భర్తను తీసుకురావాలి అని డిమాండ్ చేస్తుంది. అక్షయ్ వాళ్ళ మేడం ద్వారా శ్రీకర్ను బయటకు తీసుకొస్తారు. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి మాత్రం చాలా రోజుల తర్వాత మంచి డ్రామా అని చూస్తున్నాను మంచి కిక్ ఇస్తుంది అని అనుకుంటుంది. అంత లోపలే అవని శ్రీకర్ ను తీసుకొని ఇంటికి వస్తారు. ఇక అందరూ కలిసి వ్రతం చేస్తారు. పల్లవి మాత్రం షాక్ లోనే ఉండిపోతుంది.. నేను ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా సరే అది నాకే రివర్స్ అవుతుంది అని అనుకుంటుంది. అవనిని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా నాకు మాత్రం రివర్స్ అవుతుంది ఏంటో నా కర్మ అని పల్లవి అనుకుంటుంది.
పార్వతి నా కోడలు అవని చాలా తెలివైనది అని సంబరపడిపోతుంది.. నా ఇంటి పరువు ని ఇవాళ కాపాడింది తన మంచితనం వల్లే శ్రీకర్ బయటకు వచ్చారు అని అంటుంది. పార్వతి ఇలా సడన్ గా ట్విస్ట్ ఇవ్వడంతో పల్లవి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈమెకు ఏదో ఒకటి చేసినా కూడా పెద్ద కోడలే దేవత అని నెత్తిన పెట్టుకుంటుంది అని అనుకుంటుంది. అయితే అవని నువ్వు చేసిన సాయాన్ని అస్సలు మర్చిపోలేను అవని నా కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటావని పార్వతి అంటుంది. కానీ పల్లవి మాత్రం చేసేదే అవని అక్కయితే మళ్లీ కాపాడమేంటి అత్తయ్య అని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతుంది.
ఏం మాట్లాడుతున్నావ్ పల్లవి అవని ఏం చేసింది అని అంటుంది. మిమ్మల్ని చంపాలని అనుకోవడం తప్పు కదా అత్తయ్య.. ఆ షాప్ లో నుంచి మేము ఇంకా కోలుకోలేదు కానీ మీరు మాత్రం అవని అక్కని క్షమించేశారు అని మళ్లీ కావాలని గుర్తుచేస్తుంది పల్లవి.. కమల్ నీ నోటికి అదుపు అనేది ఉండదా.. ఇప్పుడు మా వదిన మంచితనం వల్లే అక్షయ్ అన్నయ్య వాళ్ళ మేడం శ్రీకర్ నేను బయటకు తీసుకొచ్చింది ఆ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకో అనేసి అంటాడు.
ఇక అందరూ కలిసి శ్రీకర్ ను ఏమైందని అడుగుతారు. అన్నయ్య చేత దొంగ సంతకాలు పెట్టించుకుని ఆస్తులు పోవడానికి కారణమైన ఆ వ్యక్తిని నేను పట్టుకున్నాను. ఇంట్లో పూజలు చేస్తున్నారని అవి ఆగిపోకూడదనే నేను మా ఫ్రెండ్ దగ్గర అతని ఉంచాను కానీ ఎలా తప్పించుకున్నాడు నాకు అర్థం కావట్లేదు.. అయితే నేను అతని ఏమీ బెదిరించలేదు నిజం చెప్పమని అడిగాను.. తప్ప ఇంకేమీ చేయలేదు కావాలని నన్ను ఎవరో ఇరికించాలని ప్రయత్నం చేశారు అని శ్రీకర్ అంటాడు..
Also Read : పార్వతిని దారుణంగా అవమానించిన ప్రభావతి..మీనాకు రోహిణికి వార్నింగ్.. షీలా ఎంట్రీ..
పల్లవి చక్రధర్ కి ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్తుంది. డాడ్ మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. నేను ఎంత చేసినా సరే అది నాకే ఎదురు సేవకిస్తుంది అని పల్లవి అంటుంది.. ఇవాళ అయితే తప్పించుకున్నారు ఏదో ఒక రోజు దొరుకుతారు లే బేబీ నువ్వు ఏమి టెన్షన్ పడకు అని అంటాడు. పల్లవి మాత్రం ఏం చేసినా రివర్స్ అవుతున్నాయి ఏదో ఒకటి ఆలోచించి గట్టిగానే ప్లాన్ చేయాలి అని అనుకుంటుంది. అవని రాజేంద్రప్రసాద్ ఇకనుంచి మేము వెళ్ళిపోతాము అని అంటారు. అందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు కదా అని పార్వతి అంటుంది.. అక్షయ్ మాత్రం అవని పై కోపంగానే ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..