BigTV English

Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. గబ్బర్ సింగ్ నటుడు మృతి!

Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. గబ్బర్ సింగ్ నటుడు మృతి!

Tollywood: గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఒకరి మరణం మరిచేలోపే మరొకరి మరణం ఇండస్ట్రీని అనాధను చేస్తోందనే వార్తలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇలా చనిపోయిన వారిలో కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే.. మరికొంతమంది ఆత్మహత్య చేసుకొని తనువు చాలిస్తున్నారు. ఇంకొంతమంది వయసు మీద పడడంతో స్వర్గస్తులవుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో విషాదం ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో విలన్ గ్రూప్ లో ఒకరైన నటుడు మృతి చెందాడు.


గబ్బర్ సింగ్ నటుడు మృతి..

పూర్తి వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని హనుమంతపూర్ గ్రామానికి చెందిన నీరుడి వీరేష్ (Neerudi Veeresh) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 40 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదులోనే నివాసం ఉంటూ పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. గత కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురైన ఈయనకు పెరాలసిస్ వ్యాధి సోకింది. దీంతో సినిమాలలో నటించలేక తన సొంత గ్రామమైన హనుమంతపూర్ గ్రామంలోనే ఉంటున్నారు. ఇక వ్యాధి తీవ్రతరం కావడంతో అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. వీరేష్ కి భార్య శిరీష ఉన్నారు. వీరేష్ మరణంతో హనుమంతపూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక వీరేష్ మరణ వార్త విని సినీ సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈయన మరణం పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తారేమో చూడాలి.


నీరుడి వీరేష్ నటించిన సినిమాలు..

‘గబ్బర్ సింగ్’ సినిమాలో విలన్ గుంపులో ఒకరిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ప్రభాస్ (Prabhas)హీరోగా నటించిన రెబల్(Rebal), ఎన్టీఆర్(NTR )హీరోగా నటించిన అరవింద సమేత(Aravindha Sametha), నాగచైతన్య (Naga Chaitanya), సునీల్(Sunil ) కాంబినేషన్లో వచ్చిన తడాఖా(Tadakha), చెన్నై ఎక్స్ప్రెస్ (Chennai express) వంటి చిత్రాలలో విలన్ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. అటు సినిమాలలోనే కాదు కొన్ని సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు సంపాదించారు. ఇక ప్రస్తుతం ఈయన పెరాలసిస్ వ్యాధి బారిన పడి మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Related News

War 2 – Ntr: ఎన్టీఆర్ కి ఘోర అవమానం, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు

Rajinikanth: ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? రజనీ ను చూసి నేర్చుకోండి – సజ్జనర్

Actor Suman: ఆయన దయతోనే రాజకీయాలలోకి వస్తా.. క్లారిటీ ఇచ్చిన సుమన్!

Ram Pothineni: అడ్డంగా దొరికిపోయిన రామ్ పోతినేని, భాగ్యశ్రీ , జాగ్రత్తలు తీసుకోవాలి

Dharma Mahesh: భార్యను వేధిస్తున్న డ్రింకర్ హీరో, సినిమా అనుకున్నాడా?

Naga Vamsi: అప్పుడు ముంబై నిద్రపోలేదు, ఇప్పుడు నువ్వు పడుకుంటున్నావా అన్న?

Big Stories

×