OTT Movie : ఆసక్తికరంగా సాగే సినిమాలలో , ఈ వాంపైర్ సినిమాలు కూడా ఉంటాయి. ఈ సినిమాలను చూడటానికి ఉత్సాహం చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఈ కోవలో వచ్చిన ‘ట్విలైట్’ సినీమాకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారు. రక్త దాహంతో ఈ వాంపైర్లు చేసే అరాచకం మామూలుగా ఉండదు. ఇలాంటి మూవీ ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ వాంపైర్ హారర్-యాక్షన్ మూవీ పేరు ‘V for Vengeance’. 2022 లో వచ్చిన ఈ సినిమాకు కెల్లీ హాలిహన్ దర్శకత్వం వహించారు. ఇందులో జోసెలిన్ హడ్సన్ (ఎమ్మా), గ్రేస్ వాన్ డియెన్ (స్కార్లెట్), పౌలిన్ డైర్ (కేట్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 25 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDb లో 4.1/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఎమ్మా, స్కార్లెట్, కేట్ అనే అక్కా చెల్లెళ్లకు చిన్నతనంలోనే ఒక ట్రాజెడీ జరుగుతుంది. వీళ్ళ తల్లిదండ్రులను ఒక శక్తివంతమైన వాంపైర్ తోర్న్ హత్య చేస్తాడు. ఆతరువాత తోర్న్ ఎమ్మా, స్కార్లెట్‌ను వాంపైర్లుగా మారుస్తాడు, కానీ వారి చిన్న సోదరి కేట్ ఆ దాడి నుండి తప్పించుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, ఎమ్మా తోర్న్ నుండి తప్పించుకుని ఒక మంచి వాంపైర్‌గా జీవిస్తుంది. కేవలం చెడ్డ వాళ్ళను మాత్రమే చంపుతూ రక్త దాహం తీర్చుకుంటుంది. స్కార్లెట్ మాత్రం తోర్న్‌తో ఉంటూ అతని రక్తపిపాసి వాంపైర్ గుండాలతో పనిచేస్తుంది. ఇక చివరి సోదరి కేట్, శాస్త్రవేత్త బుల్స్ఐతో కలిసి, వాంపైరిజాన్ని నయం చేసే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తుంది. కానీ ఈ ప్రయోగాన్ని తోర్న్ నాశనం చేయాలనుకుంటాడు. ఇక వాళ్ళ పై దాడి చేయడానికి వస్తాడు.
ఎమ్మా, స్కార్లెట్ కలిసి కేట్‌ను రక్షించడానికి, తోర్న్‌ను ఓడించడానికి బయలుదేరతారు. వారు మార్కస్ అనే బౌంటీ హంటర్‌తో జతకడతారు.
ఎమ్మా, స్కార్లెట్, కేట్ కలసి తోర్న్ అతని అనూచారులపై ప్యాక్డ్ ఫైట్‌లో తలపడతారు. కేట్ తయ్యారు చేసిన వ్యాక్సిన్ “V-టైప్” రక్తంతో రూపొందుతుంది. వాంపైరిజాన్ని ఎదుర్కొనేందుకు ఈ వ్యాక్సిన్ కీలకమవుతుంది. చివరికి ఈ అక్కా, చెల్లెళ్ళు తోర్న్‌ను ఎదుర్కుంటారా ? తోర్న్ వీళ్ళను ఎలా ఇబ్బందులు పెడతాడు ? ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలని అనుకుంటే, ఈ వాంపైర్ హారర్-యాక్షన్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : బ్యాచిలర్స్ తో ఆడుకునే ఆడ దెయ్యం… ఈ మలయాళ కామెడీ కమ్ హర్రర్ మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్