Intinti Ramayanam Today Episode june 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ది బయట ఆరేసిన షర్ట్ అవని వాళ్ళ ఇంట్లో పడుతుంది.. ఆ షర్ట్ కోసం దొంగగా ఇంటికొచ్చిన అక్షయ్ ను రాజేంద్రప్రసాద్ కర్రతో చితకబాదుతాడు. మధ్యలో అవని అడ్డుపడి అతను దొంగ కాదు మీ అబ్బాయే అంటుంది.. మీరెవరు మా ఇంటికి రాకూడదనే కదరా అవన్నీ అడ్డుపెట్టాం మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావురా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. గేటు దూకి లోపలికి వచ్చాను నా షర్ట్ ఇక్కడ పడిపోయింది అని అంటాడు అక్షయ్. రాజేంద్రప్రసాద్ మాత్రం వీడొక గజదొంగ అని పెద్ద క్లాస్ పీకుతాడు. ఇక పార్వతిని పిలిచి రాజేంద్రప్రసాద్ రచ్చ రచ్చ చేస్తాడు.. అవని కోసమే అక్షయ్ వచ్చాడని చెప్పగానే అవని సిగ్గుతో మురిసిపోతుంది. అటు భానుమతి తన భర్త ఎక్కడున్నాడో కనిపించలేదు అంటూ తెగ బాధ పడిపోతూ ఉంటుంది.. మొత్తానికి కమల్ పక్కా ప్లాన్ తోనే భానుమతిని అవని ఇంటికి రప్పిస్తాడు.. వచ్చింది కమలే అని తెలుసుకున్న అవని నీ ప్రయత్నం మంచిదే కన్నయ్య అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేశ్వరి రాజేంద్రప్రసాద్ దగ్గరికి వస్తుంది. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే నేను అసలు నమ్మలేకున్నాను అన్నయ్య. నా గుండె తరుక్కుపోతుంది అని బాధపడుతుంది. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావ్ అన్నయ్యా అంటూ ఏడుస్తుంది రాజేశ్వరి.. చానాళ్ల తరువాత నిన్ను చూసినందుకు ఆనందంగా ఉంటే.. కన్నీళ్లు పెట్టుకుంటావ్ ఏంటమ్మా అని అంటాడు రాజేంద్ర. అవునూ మీ ఫ్రెండ్‌కి ఎవరికో బాలేదని అమెరికా వెళ్లావ్.. ఇప్పుడు వాళ్లకి ఎలా ఉంది? నువ్వు ఎప్పుడొచ్చావ్ అని అడుగుతాడు రాజేంద్ర. బాగానే ఉంది అన్నయ్యా.. పార్వతి మాత్రం కనీసం పట్టించుకోని కూడా పట్టించుకోదు. ఏంటి వదిన నువ్వు కనీసం ఎలా ఉన్నావ్ అని కూడా మాట్లాడట్లేదు అని రాజేశ్వరి అంటుంది.
నువ్వు మీ అన్నయ్యని వెంటపెట్టుకుని వచ్చావ్ అంటే.. మమ్మల్ని నిలదీయడానికి గొడవలు పడటానికే వచ్చి ఉంటావ్ అని అర్థం అయ్యింది. అందుకే విదేశాల్లో ఉన్న నిన్ను పనికట్టుకుని పిలిపించినట్టుంది… అందుకే ఎలా ఉన్నావని ఎలా అడుగుతాను అని పార్వతి రాజేశ్వరి కి షాక్ ఇస్తుంది. ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని వదినా ఇప్పుడు ఎలా మారిపోయావో అర్థం అవుతుంది. ఇన్నేళ్లలో నా గురించి నీకు ఇదే నాకు తెలిసింది అని రాజేశ్వరి సీరియస్ అవుతుంది. మీరందరూ కలిసి ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని ఎంత చెప్పినా కూడా పార్వతి మాత్రం అస్సలు వినదు. ఇక బయటకు వచ్చిన రాజేశ్వరి అవనితో ఏంటమ్మా అవని కుటుంబం ఇలా మారిపోయింది అని బాధపడుతుంది. దానికి అవని మీరేం బాధపడకండి పిన్ని మళ్లీ మన కుటుంబాన్ని అలా తీసుకొచ్చే బాధ్యత నాది మీరు మనశ్శాంతిగా వెళ్లి రండి అని అంటుంది.
పల్లవి శ్రియాల ఇద్దరూ నగలు వేసుకుని మురిసిపోతూ ఉంటారు. అత్త ఇచ్చిన నగలను మనకు నచ్చిన డిజైన్లలో చేయించుకొని వేసుకున్నాము ఈ విషయం వీళ్లిద్దరికి చెప్తే మనల్ని నరికి పాత్ర వేస్తారు అని అనుకుంటారు. కొద్దిరోజులు పోయిన తర్వాత అవని నగలు కూడా అలానే కరిగించి మనకు నచ్చినట్లు చేయించుకుందామని అనుకుంటారు. ఆ మాటలు విన్నా కమల్ వీరిద్దరి ప్లాన్ ని తెలుసుకొని దొంగగా ఇంట్లోకి వస్తాడు. ఆ విషయాన్ని ఆ తర్వాత వచ్చిన కమల్ శ్రీకర్లకు చెప్తారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ నగలు ఎక్కడినుంచి వచ్చాయి ఎలా వచ్చాయని ఆరా తీస్తారు అని అనగానే శ్రేయ అవి గిల్టు నగలే పోతే పోనీలే అనేసి అంటుంది.
Also Read: రోహిణికి టెన్షన్..శోభన, ప్రభావతి డిష్యుం..డిష్యుం.. బాలు ఇరుక్కుంటాడా..?
శ్రీకరు చక్రధర్ ని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడు. అవని ఫోన్ చేసి మీ అత్తయ్యకు ఈ విషయాన్ని చెప్పి ఫైల్ గురించి వెతుకు శ్రీకర్ అని అంటుంది. శ్రీకరు రాజేశ్వరి దగ్గరికి వెళ్లి అవని వదిన మీకు అంత చెప్పింది కదా అత్తయ్య నేను మావయ్యకి వాళ్ళకి సంబంధం ఏమైనా ఉందేమో అని తెలుసుకోవడానికి వచ్చాను. ఒకవేళ వీళ్లిద్దరికి సంబంధం గనక ఉంటే ఆ ఫైల్ ఇక్కడే ఉంటుంది కదా అత్తయ్య మళ్ళీ ఆస్తులని తిరిగి తెచ్చుకోవచ్చు అని అడుగుతాడు. ఆ మాట వినగానే రాజేశ్వరి పదా నీకు మామయ్య ఫైల్స్ పెట్టే గదిని చూపిస్తానని తీసుకెళ్తుంది. అప్పుడే ఫైల్ మర్చిపోయిన చక్రధర్ ఇంటికి వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో శ్రీకర్ చక్రధర్ కి దొరుకుతాడా లేదా అన్నది చూడాలి..