Navjot -MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2007లో టి-20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ధోని కెరీర్ లో అప్పటివరకు అతడికి ఉన్న గుర్తింపు మరింత అధికం అయింది. ధోని అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి చాలా సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కేవలం ఐపిఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు.
Also Read: Suryakumar Yadav Mother: ఆస్పత్రిలో శ్రేయాస్.. సూర్య కుమార్ తల్లి సంచలన నిర్ణయం
అయినప్పటికీ అతడు అభిమానుల మధ్య ఎప్పుడూ చర్చలో ఉంటాడు. మహేంద్ర సింగ్ ధోని 2010లో సాక్షి సింగ్ ని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు జీవా ధోని అనే ఓ కుమార్తె ఉంది. మహేంద్ర సింగ్ ధోని చివరిసారిగా మైదానంలో ఐపీఎల్ 2025 లో ఆడుతూ కనిపించాడు. ఆ సమయంలో గాయపడిన ఋతురాజ్ గైక్వాడ్ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడి నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది.
మహేంద్ర సింగ్ ధోని 2010లో సాక్షి సింగ్ ని వివాహం చేసుకున్న అనంతరం అతడి బ్యాటింగ్ ఎనర్జీ తగ్గిందని పలు నివేదికలు చెబుతున్నాయి. వివాహానికి ముందు అతడి కెప్టెన్సీ, అద్భుతమైన వికెట్ కీపింగ్, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే స్వభావం, అద్భుతమైన ఫినిషింగ్ సామర్థ్యం ఉండేవి. వివాహం తర్వాత కూడా ఇవి చాలాకాలం కొనసాగాయి. కానీ వివాహం తర్వాత ధోని బ్యాటింగ్ ఆవరేజ్ తగ్గిపోయిందని ఓ నివేదిక వైరల్ గా మారింది. వివాహం తర్వాత కూడా ధోని 2011 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి అనేక విజయాలను భారత్ కి అందించాడు.
Also Read: Bumrah-Harshit: ఒరేయ్ పిల్ల బచ్చా.. అవేం బూట్లురా, హర్షిత్ రాణా పరువు తీసిన బుమ్రా
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి అనేకసార్లు కెప్టెన్ గా వ్యవహరించి విజేతగా నిలిపాడు. అయితే పెళ్లి తర్వాత ధోని ఎనర్జీ తగ్గిపోయిందని.. పెళ్లి అయిన తరువాత అత్యధిక బ్యాటింగ్ ఎనర్జీతో ఉంది నవజ్యోత్ సింగ్ సిద్దూ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివాహం జరిగిన తరువాత బ్యాటింగ్ ఎనర్జీ లెవెల్స్ లో మహేంద్రసింగ్ ధోని మూడవ స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో నవజ్యోత్ సింగ్ సిద్దు, రెండవ స్థానంలో రమీజ్ రజా, మూడవ స్థానంలో ధోని, నాలుగో స్థానంలో షేన్ వాట్సన్, ఐదవ స్థానంలో డేవిడ్ వార్నర్ నిలిచారు.
సాధారణంగా ఏ క్రికెటర్ అయినా వయసు పెరిగే కొద్దీ రిప్లైక్స్ లు, వేగం తగ్గుతాయి. మహేంద్ర సింగ్ ధోనీ వివాహం తరువాత వయసు రిత్యా అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలగడం, ఐపీఎల్ లో కొన్ని సీజన్లలో ప్రదర్శన మారడం జరిగింది. అయితే ఇవి పెళ్లి వల్ల ఎనర్జీ తగ్గిందని భావించడం జరిగింది కాదంటున్నారు ధోని అభిమానులు. రిటైర్మెంట్ అనంతరం ధోని తన వ్యాపారాలు, ఇతర వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టారని.. క్రికెట్ ప్రపంచంలో చెరుకుగా లేని కారణంగా ఇలాంటి ఊహగానాలు పుట్టుకొచ్చాయని చెప్పుకొస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">