Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఏఎం రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. గత ఐదేళ్లుగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూలై 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. కొందరు సినిమా అస్సలు ఏమి బాగోలేదని అంటే .. ఇంకొందరు చూడొచ్చు అని చెప్పుకొస్తున్నారు. మిక్స్డ్ టాక్ పక్కన పెడితే.. వీరమల్లు మంచి రికార్డ్ కలక్షన్స్ అందుకుంది. ఐదేళ్ల తరువాత రిలీజ్ అయినా కూడా వీరమల్లు ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు. ఎన్ని ట్రోల్ల్స్ వచ్చినా కూడా సినిమాపై అంత నెగిటివ్ ఇంపాక్ట్ పడలేదు.
ఇక వీరమల్లు సినిమాలో మెయిన్ డ్రాబ్యాక్ అంటే విఎఫ్ఎక్స్. గ్రాఫిక్స్ అస్సలు ఏం బాలేదని, ఆ గుర్రాలు పరిగెత్తే సీన్స్ అయితే పంచతంత్ర బొమ్మలు చూసినట్లు ఉందని, మధ్యలో పవన్ కళ్యాణ్ ని కూడా చాలా దారుణంగా చూపించారని, దీనివలన సినిమా ట్రోలింగ్ కు గురైందని నెటిజన్స్ చెప్పుకొచ్చారు. సక్సెస్ మీట్ లో పవన్ కూడా దీనిపై మాట్లాడాడు. ప్రేక్షకులు ఏదైతే నచ్చలేదో.. దానిని మారుస్తామని, దానిపైనే తమ టీమ్ వర్క్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక చెప్పినట్లుగానే వీరమల్లును సరికొత్తగా చూపించబోతున్నారు.
తాజాగా వీరమల్లు కొత్త వెర్షన్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎక్కడ అయితే ట్రోల్స్ చేశారో.. వాటిని తొలగించి, వాటి ప్లేస్ లో కొత్తవి పెట్టారు. అంతేకాకుండా అనవసరమైన సీన్స్ ను ట్రిమ్ చేయడమే కాకుండా కొత్త సీన్స్ ను కూడా యాడ్ చేశారు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. ముఖ్యంగా బండరాయి కిందపడే సీన్ ను మార్చారని, పవన్ పై బాణాలు వేసే సీన్, రాజప్రసాదంపై జెండా మార్చే సీన్ అయితే ఎక్కువ ట్రోల్స్ కు గురైంది. ఆ సీన్ లో పవన్ ముఖం మొత్తానికే బొమ్మలా ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాటన్నింటిని మార్చినట్లు తెలుస్తోంది. నేటినుంచి సరికొత్తగా వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనివలన సినిమాపై ఉన్న ట్రోల్స్ తగ్గుతాయని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఇకనుంచి వీరమల్లు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
వీరమల్లు కథ విషయానికొస్తే.. ధనవంతుల వద్ద నుంచి డబ్బు కొట్టేసి.. పేదవారికి దోచిపెట్టే దొంగ హరిహర వీరమల్లు. అతని ధైర్య సాహసాలు చూసిన కూతుబ్ షా.. ఎంతో విలువైన కోహినూర్ వజ్రం.. ఔరంగజేబు నెమలి సింహాసనంపై ఉందని, అది తమ గౌరవం అని, దానిని దొంగిలించి తీసుకురావాలని వీరమల్లును కోరతాడు. దానికి ప్రతిఫలంగా వజ్రాల గనినే ఇస్తాను అని చెప్తాడు. ఇక ఆ డీల్ కు ఒప్పుకున్న వీరమల్లు.. ఢిల్లీకి బయల్దేరతాడు. అయితే అసలు వీరమల్లు ఎవరు.. ? అతను ఢిల్లీకి వెళ్ళడానికి కోహినూరే కారణమా.. ? లేక ఇంకేదైనా కారణం ఉందా.. ? వీరమల్లు కోసం ఔరంగజేబు ఎందుకు ఎదురుచూస్తున్నాడు.. ? అనేది తెలియాలంటే హరిహర వీరమల్లు చూడాల్సిందే.
BATTLE FOR DHARMA JUST GOT BIGGER ⚔️⚔️
Updated & reloaded content across all screens for the BEST cinematic experience 🔥🔥#HariHaraVeeraMallu – IN CINEMAS NOW 💥💥#BlockbusterHHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna… pic.twitter.com/acmo6BE2tP
— Mega Surya Production (@MegaSuryaProd) July 27, 2025