Heart Attack: గుండెపోటు ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కార్డియాక్ ఆరెస్ట్‌తో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు 25 ఏళ్ల గుండ్ల రాకేష్ హైదరాబాదులోని ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
షటిల్ ఆడుతూనే.. గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి
రోజూ షటిల్ ఆడే అలవాటు ఉన్న రాకేష్.. నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్ప కులాడు. గమనించిన స్నేహితులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో షటిల్ ఆడి గుండెపోటుతో రాకేష్ మరణించడంతో స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారి. ఈ సంఘటన స్థానికంగా షాక్‌కు గురిచేసింది, రాకేష్ యువకుడైనప్పటికీ ఇలాంటి అకస్మాత్తు గుండెపోటు బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది.
Also Read: మెటా సంచలనం.. ఇది ఉంటే చాలు.. కీబోర్డు మౌస్ అవసరం లేదు.!
కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిన రాకేష్ మృతి..
గుండెపోటు కారణాలు.. సాధారణంగా ఒత్తిడి, గుండె సంబంధిత సమస్యలు, జీవనశైలి, లేదా శారీరక శ్రమ సమయంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యల వల్ల సంభవించవచ్చంటున్నారు. ఈ ఘటన యువతలో ఆరోగ్య పరీక్షల పట్ల అవగాహన పెంచాల్సిన అవసరాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు. ఈ దుర్ఘటన రాకేష్ కుటుంబానికి, స్నేహితులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
షటిల్ ఆడుతూనే.. గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి
ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్(25)
హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రాకేష్
నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన రాకేష్… pic.twitter.com/ZYyMmBXP8W
— BIG TV Breaking News (@bigtvtelugu) July 28, 2025