HHVM Pre Release Event Passes Sells In Block: అభిమానులంత ఎప్పుడెప్పుడా అని ఆసక్తి ఎదురుచూస్తున్న ఆ సమయం వచ్చేసింది. హరి హర వీరమల్లు మూవీ జూలై 24న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మూవీ రిలీజ్ కి ఇంకా మూడు రోజులే ఉంది. కానీ, ప్రమోషన్స్ ఎక్కడ కనిపించలేదు. నిన్నటి వరకు మూవీ టైం చాలా సైలెంట్ గా ఉంది. దీంతో ఏకంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు.
పవన్ ఎంట్రీతో పెరిగిన బజ్
హరి హర వీరమల్లు అనాథ కాదని.. నేనున్నాను అంటూ నిర్మాతకు అండగా నిలిచారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. నిర్మాత నష్టపోకుండ ఉండకూడదని హరి హర వీరమల్లు ప్రమోషన్స్ కోసం స్వయంగా వచ్చారు. ఇవాళ ప్రెస్ మీట్ మూవీ ఒక్కసారిగా బజ్ పెంచారు. ఇవాళ సాయంత్రం హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ హైటెక్ సిటీలో శిల్పా కళ వేదికలో ఈ మూవీ భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత చర్యల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గ్రాండ్ గా ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే ఈవెంట్ కూడా మొదలైంది. కానీ, ఇంకా పవన్, మూవీ టీం ఈవెంట్ కి చేరుకోవాల్సి ఉంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద అభిమానుల సందడి
ఏ హీరో సినిమా అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంట్రీకి పాస్ లు ఉంటాయి. అభిమానులకు ఫ్రీ గా వాటిని అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులంత భారీ సంఖ్యలో ఎదురయ్యారు. తమ ఈవెంట్ కి వెళ్లకపోయినా.. తమ అభిమాన హీరో ఒక్క చూపు చూసుకోని వెళ్లిపోతాం అంటున్నారు. దూరం నుంచి అయిన ఆయన కారు నెంబర్ చూసి వెళ్లిపోతాం అంటున్నారు. మరికొందరు మాత్రం తమ అభిమాన హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కళ్లరా చూడాలని తపన పడుతున్నారు.
బ్లాకులో ఈవెంట్ పాస్ లు ధరేంతంటే..
ఎలాగైన ఈవెంట్ కి వెళ్లాలని ఫ్రీ పాస్ లను డబ్బులకు తీసుకోవడానికి కూడా సిద్దమయ్యారు. అయితే దీనిని కొందరు భారీగా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఉచితంగా పంచే పాస్ లను బ్లాక్ లో అమ్ముతున్నారు. మూవీ టికెట్స్ బ్లాకులో అమ్మడం విన్నాం.. కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పాస్ లను కూడా బ్లాకులో అమ్మడం తొలిసారి చూస్తున్నామంటున్నారు. ఈవెంట్ ముందర కొందరు పాస్ లను బ్లాకు లో అమ్ముతున్నారట. ఒక్కొక్కొ పాస్ ని రూ. 3 వేల నుంచి రూ. 4 వేల కు అమ్ముతున్నట్టు స్వయంగా అభిమానులే చెబుతున్నారు. ఎక్కడైన టికెట్స్ బ్లాక్ అమ్మడం విన్నాం.. కానీ, ఫ్రీ ఇచ్చే పాస్ లను బ్లాక్ లో అమ్ముతున్నారు. అదీ కూడా మూడు నుంచి నాలుగు వేలు అంటున్నారని షాక్ అవుతున్నారు. అయినప్పటికీ పవన్ తమ దేవుడని, తమ దేవుడిని సినిమాకు అంత మొత్తం కూడా చెల్లిస్తామంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Also Read: ED Notice: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్.. రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు