ED Notice to Rana and Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహరం సంచలనం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు పాల్పడిన పలువురు సినీ, టీవీ నటీనుటులపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే. వారిలో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి వంటి ప్రముఖ స్టార్స్ కూడా ఉండటం టాలీవుడ్ లో ఈ వ్యవహరం సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసు విచారణ ఈడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసు లో విచారణలో భాగంగా తాజాగా ఈడీ పలువురు సినిమా ఆర్టిస్టులకు నోటీసులు ఇచ్చింది.
ఈ నెల విచారణకు రానా, ప్రకాశ్ రాజ్
హీరో రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలకు నోటీసులు ఇస్తూ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్రాజ్ రావాలని ఆదేశించారు. వచ్చే నెల ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మిలు విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈ బెట్టింగ్ యాప్స్ అరికట్టేందుకు ఏకంగా ఆర్టీసీ ఎండీ, మాజీ సీపీ సజ్జనార్ రంగంలోకి దిగారు. బెట్టింగ్ లకు పాల్పడి.. జీవితాలు నాశనం చేసుకోవద్దని రాష్ట్ర స్థాయిలో ప్రచారం కూడా నిర్వహించారు. ఇదే సమయంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సామాన్య ప్రజలను బెట్టింగ్ కి దిగేలా ప్రభావితం చేసిన సెలబ్రిటీలపై చర్యలు దిగారు.
29 మంది సెలబ్రిటీలపై కేసు
హైదరాబాద్ పోలీసులు సదరు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వారికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో సుమారు 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. రానా, విజయ్ దేవరకొండ, లక్ష్మి మంచు, ప్రకాశ్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్ శ్రీముఖీ, విష్ణు ప్రియ, రితూ చౌదరి, యాంకర్ శ్యామల వంటి తదితరులపై కేసు నమోదు చేశారు. అలాగే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్లైనా.. వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, నీతూ అగర్వాల, అమ్రతి చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పంుడ, ఇమ్రాన ఖాన్, హర్ష సాయి, సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతలపై కేసు నమోదైంది. ఇక ఈ కేసు విచారణలో భాగంగా పంజాగుట్ట పోలీసులు పలువురు సెలబ్రిలీను విచారించిన సంగతి తెలిసిందే. విష్ణు ప్రియ, రితూ చౌదరితో పాటు పలువురిని ఈ కేసులో మేలో పోలీసులు విచారించారు.
Also Read: Nithya Menon: పెద్ద హీరోలతో సినిమా చేయడం వేస్ట్.. నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్