Hari Hara Veeramallu Postponed : హరి హర వీరమల్లు… ఎక్కువ సార్లు వాయిదా పడ్డ మూవీ అంటూ ఆస్కార్‌లో ఓ క్యాటగిరి పెడితే… ఈ మూవీ తప్పకుండా నామినేట్ అవుతుంది. ఇంకా ఛాన్స్ ఉంటే ఆస్కార్ అవార్డు కూడా రావొచ్చు. దాదాపు ఆరేళ్ల పాటు రిలీజ్ డేట్ విషయంలో దోబూచులాట ఆడుతుంది.
ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు అప్పట్లో. కానీ, ఏవేవో కారణాలు జూపి వాయిదా వేశారు. ఇప్పుడు తాజా రిలీజ్ డేట్ అంటే… జూలై 24. ఇప్పుడు ఈ డేట్ నుంచి కూడా హరి హర వీరమల్లు వాయిదా పడబోతుంది అని ఇండస్ట్రీలో ఓ వార్త సర్క్యూలేట్ అవుతుంది. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పిరియాడికల్ మూవీ హరి హర వీరమల్లు… రిలీజ్‌కు చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. దాదాపు 60 శాతం షూటింగ్ చేసిన తర్వాత ఏకంగా డైరెక్టరే మారిపోయాడు. అలాగే దాదాపు 6 సంవత్సరాల పాటు… రిలీజ్‌కు నోచుకోకుండా.. ఉండిపోయింది. అంత ఎందుకు కనీసం షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేకపోయింది.
ఫైనల్‌గా ఇటీవల పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ పూర్తి చేశారు. ఇక రిలీజ్ డేట్ ప్రకటించడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సీజీ వర్క్ అండ్ బిజినెస్ లేకపోవడంతో రిలీజ్ డేట్స్ ప్రకటించినా… వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. జూన్ 12న తప్పకుండా రిలీజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ, తీరా చూస్తే బిజినెస్ అవ్వలేదు. సీజీ వర్క్ పూర్తి అవ్వలేదు. కనీసం, ట్రైలర్ కట్ వర్క్ కూడా పూర్తి చేయలేదు. దీంతో ఎప్పటిలానే అందరూ ఊహించినట్టు వాయిదా వేశారు.
ఇప్పుడు జూలై 24 అని ఓ కొత్త డేట్ అనౌన్స్ చేశారు. రేపు ట్రైలర్ కూడా రాబోతుందని అంటున్నారు. కానీ, రిలీజ్ అనుకున్న డేట్‌కే వస్తుందా అంటే… ఎక్కడో చిన్న సైలెంట్.
కారణం.. సినిమా బిజినెస్ ఇంకా అవ్వలేదు. ఏదో ఒక్క ఏరియా మాత్రమే అయిందట. మిగితా ఏరియాల్లో భారీ ప్రైజ్ చెబుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న బజ్ చూస్తే అది సాధ్యం కాదు. అందుకే బయ్యర్లు అందరూ వెనకడుగు వేస్తున్నారట.
ట్రైలర్ వచ్చాకా అయినా… బయ్యర్లు తాము చెప్పిన ధరకు ఒప్పుకుంటురా ? అని నిర్మాత రత్నం ఎదురుచూస్తున్నాడు. ట్రైలర్ బాగుంటే… బిజినెస్ జరగొచ్చు. కానీ, ట్రైలర్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా… మళ్లీ రీ-వర్క్ చేయాల్సి వస్తుందేమో. అదే జరిగితే.. వాయిదా తప్పదు.
అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు ఈ సినిమా రిలీజ్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. ఎప్పుడో చూసుకున్న డీల్ కూడా క్యాన్సిల్ చేసుకుని కాస్త తక్కువ ప్రైజ్‌కు కొత్తగా డీల్ చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఈ డీల్ ను కూడా క్యాన్సిల్ చేసుకోవద్దు అంటే… జూన్ 24న తప్పకుండా రిలీజ్ కావాల్సింది.
అటు కింగ్‌డం కూడా వెయిట్ చేస్తుంది. ఆ సినిమా రిలీజ్ అయితే… డేట్స్ చేసుకుని రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. జూన్ 24న ఇది ఫిక్స్ అయితే.. ఆగష్టు 1న కింగ్ డం రావాలని అనుకుంటున్నారు. ఆ డేట్ ను కూడా కింగ్ డం వాళ్లు రేపో మాపో అనౌన్స్ చేయబోతున్నారు. వీళ్లపైన కూడా ఓటీటీ ప్రెషర్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ వాళ్లు చాలా తొందర పెడుతున్నారట నాగ వంశీని.
ఇవేవీ జరగొద్దు అంతా సాఫీగా ఉండాలి అంటే… రేపు రాబోయే ట్రైలర్ నెక్ట్స్ లెవెల్ ఉండాలి. అప్పుడు నిర్మాత ఆశించిన బిజినెస్ జరగాలి. అయితే ఇప్పటి వరకు వస్తున్న టాక్ ప్రకారం.. ట్రైలర్ బానే ఉందని అంటున్నారు. దాదాపు 3 నిమిషాలు ఉన్న ట్రైలర్ ఇంప్రెస్ చేసేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ ట్రైలర్ ను ఏకంగా 7 సార్లు చూశాడట. అంతలా బాగుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది. మరి అది ఆడియన్స్ ఎంతమేర నచ్చుతుందో చూడాలి.