BigTV English

Lottery Jackpot: రాత్రికి రాత్రే రూ.2000 కోట్లకు అధిపతి అయిపోయాడు.. అంతా ఆ లాటరీ మహిమే!

Lottery Jackpot: రాత్రికి రాత్రే రూ.2000 కోట్లకు అధిపతి అయిపోయాడు.. అంతా ఆ లాటరీ మహిమే!

Irish Lottery: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. వారిలో కొందరికి జాక్ పాట్ తగులుతుంది. తాజాగా ఓ ఐరిష్ వ్యక్తి కూడా తన లక్ ను టెస్ట్ చేసుకునేందుకు యూరో మిలియన్స్  లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ టికెట్ కొనుగోలు చేసినప్పడు బహుశ ఆయనకు తెలిసి ఉండదు. ఆ దేశంలోనే  ఇప్పటి వరకు ఎవరికీ దక్కనంత ప్రైజ్ మనీ తనకు దక్కుతుందని. తాజాగా లాటరీకి సంబంధించిన లక్కీ డ్రా తీశారు. అందులో సదరు వ్యక్తి ఏకంగా 208 యూరో మిలియన్స్ గెల్చుకున్నాడు. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ. 2,194 కోట్లు. ఐర్లాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద లాటరీగా చరిత్ర సృష్టించింది.


రికార్డ్ బ్రేకింగ్ లాటరీ విన్నింగ్

లక్కీ డ్రాకు ముందు యూరో మిలియన్స్ సంస్థ జాక్‌ పాట్ విలువను 250 యూరో మిలియన్లు( భారత కరెన్సీలో సుమారు రూ.2,250 కోట్లు)గా ప్రకటించింది. దక్షిణ ఐర్లాండ్‌ లోని కౌంటీ కార్క్‌ లో విన్నర్ ఈ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత లక్కీ డ్రా తీశారు. ఇది ఐర్లాండ్ లో 18వ యూరో మిలియన్స్ జాక్‌ పాట్ విజయం. అంతేకాదు, ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద విజయంగా సదరు లాటరీ కంపెనీ వెల్లడించింది. ఐరిష్ నేషనల్ లాటరీ CEO  సియాన్ మర్ఫీ ఈ విషయాన్ని వెల్లడించారు.


విజేత వివరాలను వెల్లడించని లాటరీ కంపెనీ

ఇంత పెద్ద లాటరీ గెలిచినప్పటికీ విజేత వివరాలను బయటకు చెప్పలేదు సరదు లాటరీ సంస్థ. విన్నింగ్ మనీని  క్లెయిమ్ చేయడానికి ఇప్పటికే అతడు నేషనల్ లాటరీని సంప్రదించారు. ఈ డబ్బును పొందే ప్రాసెస్ చేసేందుకు లాటరీ అధికారులు అతడికి సాయం చేస్తున్నారు. ఈ డబ్బును నిల్వ చేసుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐర్లాండ్‌ లో, లాటరీ విజేతలు తమ గుర్తింపులను ప్రైవేట్‌ గా ఉంచుకోవచ్చు. సదరు విజేతలు తమ పేర్లను బయటకు చెప్పకూడదని కోరే అవకాశం ఉంటుంది.

ఊహకు అందని అదృష్టం అంటే ఇదే!

208 యూరో మిలియన్ల బహుమతిని పొందిన వ్యక్తి సంతోషానికి అవధులు లేవు. చాలా మంది ప్రపంచ ప్రముఖుల నికర విలువను మించిపోయింది. ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం,  ఫుట్‌ బాల్ క్రీడాకారుడు హ్యారీ కేన్, గాయకుడు దువా లిపా, నటుడు డేనియల్ రాడ్‌క్లిఫ్ లాంటి తారల కంటే ధనవంతుడిగా మారిపోయాడు. ఈ మొత్తం(రూ.2,194 కోట్లు)తో లగ్జరీ ఇళ్ళు, ప్రైవేట్ జెట్‌లు, పెద్ద బిజినెస్ లు ఏర్పాటు చేసుకోవచ్చు.

గతంలో గెలిచిన అత్యధిక లాటరీ ఎంత అంటే?

ఐర్లాండ్ లో ఇప్పటి వరకు చాలా మంది లాటరీలను గెలుపొందారు.  ఐర్లాండ్‌లో గతంలో జరిగిన అతిపెద్ద యూరో మిలియన్స్ లాటరీ 2019లో గెల్చుకున్నారు. దీని విలు 175.4 యూరో మిలియన్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1,850 కోట్లు). దీనిని డబ్లిన్‌కు చెందిన ఫ్యామిలీ గెలుచుకుంది.  2025 జాక్‌ పాట్ గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది.

Read Also: అమెరికా రైళ్ల కంటే మన వందే భారత్ బెటర్.. అక్కడి రైళ్ల స్పీడ్ ఎంతంటే?

Related News

Video viral: ముంబై వరదల్లో హీరోగా మారిన స్పైడర్ మ్యాన్.. నీటిని మొత్తం తోడేశాడుగా.. వీడియో వైరల్

Dance video: చీరలో డ్యాన్స్ దుమ్ముదులిపేసింది భయ్యా.. హీరోయిన్ కూడా పనికిరాదు.. వీడియో వేరే లెవల్

Viral video: ఇవి వరద నీళ్లా.. స్విమ్మింగ్ పూలా..? ఎలా ఈత కొడుతున్నారో చూడండి, వీడియో వైరల్

Viral Video: అగ్నిపర్వతం బద్దలయ్యే క్షణాల ముందు.. ప్రియురాలికి లవ్ ప్రపోజ్, వీడియో వైరల్

Body Double: ట్రంప్‌ను కలిసింది పుతిన్ కాదా.. ఆయన డూపా? ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే?

UK Schools: ఇంగ్లాండ్‌లోని 30 స్కూళ్లను కొనేసిన చైనా.. డ్రాగన్ కంట్రీ ప్లాన్ ఇదేనా?

Big Stories

×