Railway Ticket Cancellation: పండుగ సీజన్ వస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులు ముందుగానే రైల్వే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. కానీ, కొంత మంది అత్యవసర పరిస్థితులు, సెలవులు అందుబాటులో లేకపోవడం, వెయిట్ లిస్ట్, రైళ్లు ఆలస్యంగా నడపడం లాంటి కారణాలతో చివరి నిమిషంలో తమ టికెట్లను రద్దు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో టికెట్లు క్యాన్సిల్ చేసుకునే ప్రతి ప్రయాణీకుడు కొన్ని రైల్వే రూల్స్ గురించి ముఖ్యంగా టికెట్ క్యాన్సిల్ రూల్స్ గురించి తెలుసుకోవాలి.
రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు
IRCTC యాప్, పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న రైలు టికెట్లను ఆన్ లైన్‌లో రద్దు చేసుకోవచ్చు. IRCTC రీఫండ్ నిబంధనల ప్రకారం రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
⦿ రైలు బయలుదేరడానికి 48 గంటల కంటే ముందు ఆన్ లైన్ లో కన్ఫార్మ్ టికెట్ రద్దు చేయబడితే, ప్రతి ప్రయాణీకుడికి కనీస క్యాన్సిలేషన్ ఛార్జీ వసూలు చేయబడుతుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కు రూ.240 + GST, AC చైర్ కార్ కు రూ.180 + GST వసూళు చేస్తారు.
⦿ రైలు బయలుదేరడానికి 12 గంటల ముందు ఆన్ లైన్ లో కన్ఫార్మ్ టికెట్ రద్దు చేయబడితే, అన్ని AC తరగతులకు వర్తించే కనీస ఛార్జీ, GSTకి లోబడి, 25 శాతం ఛార్జీని క్యాన్సిలేషన్ రుసుముగా వసూలు చేయబడుతుంది.
⦿ రైలు బయలుదేరడానికి 12 గంటల లోపు, రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు వరకు ఆన్ లైన్ లో కన్ఫార్మ్ టికెట్ రద్దు చేయబడితే, అన్ని AC తరగతులకు వర్తించే కనీస ఛార్జీ, GSTకి లోబడి 50 శాతం ఛార్జీని క్యాన్సిలేషన్ ఛార్జీగా వసూలు చేయబడుతుంది.
⦿ టికెట్ ఆన్ లైన్‌లో రద్దు చేయబడకపోతే రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు వరకు ఆన్ లైన్ లో TDR దాఖలు చేయకపోతే, కన్ఫార్మ్ రిజర్వేషన్ ఉన్న టికెట్లపై ఛార్జీ తిరిగి చెల్లించబడదు.
వెయిటింగ్ టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు
వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్ ను రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు వరకు ఆన్ లైన్ లో రద్దు చేసుకుంటే, ప్రయాణీకుడికి రూ.20 + GST క్యాన్సిలేషన్ ఛార్జీని తగ్గించిన మిగతా డబ్బును రీఫండ్ చేస్తారు. ప్రయాణీకులు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే, వినియోగదారులు టికెట్లను రద్దు చేయవలసిన అవసరం లేదు. ఆటో మేటిక్ గా రద్దు అవుతాయి. పూర్తి వాపసు రీఫండ్ చేస్తాయి.
పాక్షికంగా కన్ఫార్మ్ చేయబడిన టికెట్ల రద్దు ఛార్జీలు
ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది ప్రయాణీకుల ప్రయాణానికి జారీ చేయబడిన పార్టీ ఇ-టికెట్, ఫ్యామిలీ ఇ-టికెట్ లో, కొంతమంది ప్రయాణీకులు రిజర్వేషన్ ను నిర్ధారించి, మరికొందరు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాయి. అలాంటి సమయంలో వెయిట్ లిస్టులో ఉన్నవారికి పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. కన్ఫార్మ్ టికెట్ ఉన్న వారు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే రూ.20 + GST ని క్యాన్సిలేషన్ ఛార్జీగా తీసుకుని, మిగతా డబ్బును రీఫండ్ చేస్తారు. ఒకవేళ ఆన్ లైన్ లో టికెట్ రద్దు చేయకపోతే రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు వరకు అందరు ప్రయాణీకులు TDR దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.
3 గంటల కంటే రైలు ఆలస్యం అయితే..
రైలు షెడ్యూల్ టైమ్ కంటే మూడు గంటలు ఆలస్యంగా రైలు నడిస్తే టికెట్ క్యాన్సిల్ చేసుకునే వారికి ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు తీసుకోరు. పూర్తిగా రీఫండ్ అందిస్తారు.
Read Also: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!