Netizens Trolls Nayanthara: స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ అయిన నయనతారను ప్రస్తుతం నెటిజన్స్, ఇండస్ట్రీ వర్గాలు తిట్టిపోస్తున్నారు. నిధి అగర్వాల్ ను చూసి నేర్చుకో అంటూ ఆమెపై క్లాసులు పీకుతున్నారు. దీనికి కారణం హరి హర వీరమల్లు ప్రమోషన్స్. హరి హర వీరమల్లు ప్రమోషన్స్ కి, నయనతారకు సంబంధమేంటా? షాక్ అవుతున్నారు. అసలు విషయం తెలియాలంటే పూర్తి ఆర్టికల్లోకి వెళ్లాల్సిందే.
లేడీ సూపర్ స్టార్ రూటే సపరేటు..
స్టార్ హీరోయిన్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాలుగు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు ఆమె పోటీ ఇస్తోంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటోంది. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా కూడా గుర్తింపు పొందింది. సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ భామకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అదే స్థాయిలో విమర్శించే వారు కూడా ఉన్నారు. హీరోయిన్లలో ఆమెది భిన్నమైన స్వభావం అంటారు. ఎందుకంటే నయన్ సినిమా కమిటైందంటే.. దర్శక నిర్మాతలకు ఎన్నో కండిషన్స్ పెడుతుంది. రెమ్యునరేషన్ నుంచి అకాంబినేషన్ వరకు ప్రతిదీ తనకు అనుకూలంగా ఉండాలి. ఏమాత్రం ఆమె ఇబ్బందికి గురై నిర్మాతలకు చుక్కలే. అందుకే పరిశ్రమలో యాటిడ్యూడ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే అంతా ఆమె పేరే చెబుతారు. ఇక ఆమెకు ఉన్న షరతుల్లో ముఖ్యమైనది మూవీ ప్రమోషన్స్.
నిర్మాతలకు అలాంటి కండిషన్స్
ఆమె ఒక సినిమా కమిటైందంటే ముందుగా నిర్మాతలకు పెట్టే కండిషన్ ఇదే. షూటింగ్ మినహా తనే కార్యక్రమాల్లో పాల్గొనని చెప్పేస్తుంది. ముఖ్యంగా ప్రమోషన్స్ తో తనకు సంబంధం లేదంటుంది. నిజానికి నయన్ కు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ కి ఆమె ప్రమోషన్స్ పాల్గొంటే చిత్రానికి మరింత ప్లస్ అవుతుంది. కానీ, ఈ విషయంలో నయన్ మాత్రం ఎవరు చెప్పిన తన పంథాను మార్చుకోవడం లేదు. కోట్ల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ నిర్మాతలకు రీక్వెస్ట్ ఖాతరు చేయదు. తన పాత్ర షూటింగ్ పూర్తయ్యిందంటే ఇక సినిమాతో తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోంది. కానీ, తన సొంత ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలకు మాత్రం బాగానే ప్రమోషన్స్ చేసుకుంటుంది.
నిధిని చూసి నేర్చుకో..
తన రౌడీ బ్యానర్ లో తెరకెక్కి కనెక్ట్ మూవీ కోసం తొలిసారిగా నయన్ ప్రమోషన్స్ చేసింది. వరుస ఇంటర్య్వూలు ఇచ్చింది. తమిళంనే కాదు తెలుగులో వరుసగా ప్రెస్ మీట్స్, ఇంటర్య్వూలో పాల్గొంది. అదే వేరే బ్యానర్ చిత్రాలకు మాత్రం ప్రమోషన్స్ అంటే నో అంటోంది. కానీ, మిగతా హీరోయిన్లు మాత్రం అలా కాదు. ఆమె తక్కువ రెమ్యునరేషన్ అయినప్పటికీ సినిమా సక్సెస్ ని తమ భుజాన వేసుకుంటున్నారు. హీరో లేకపోయినా.. మూవీ ప్రమోట్ చేస్తున్నారు. అందులో ఇప్పుడు నిధి అగర్వాల్ ప్రత్యేక ఉదాహరణ. హరి హర వీరమల్లు ప్రమోషన్స్ కోసం నిధి ఎంతో కష్టపడుతోంది. నిర్మాత తో కలిసి ప్రతీ ఈవెంట్ కి హాజరవుతోంది. హీరో లేకపోయినా.. తన వంతుగా మూవీని భారీగా ప్రమోట్ చేస్తోంది.
సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్.. వరుస ఇంటర్య్వూలో ఇస్తూ హరి హర వీరమల్లు సక్సెస్ బాధ్యతను తీసుకుంది. ఆఖరికి ఆమె టీవీ షోలోనూ టీవీ షోలోనూ పాల్గొంటోంది. నిధి లాంటి హీరోయిన్.. ఓ డ్యాన్స్ కి షోకి రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రముఖ టీవీ ఛానళ్లలోని డ్యాన్స్ షోకు హాజరై హరి హర వీరమల్లుని ప్రమోట్ చేస్తుంది. నిధిని చూసి ఇప్పుడంతా నయనతారకు చురకలు అట్టిస్తున్నారు. నిధి చూసి నేర్చుకో.. సినిమా భారీ భారీ పారితోషికం తీసుకోవడమే కాదు.. నిర్మాతలను కూడా కాపాడుకోవాలి. మూవీ సక్సెస్ బాధ్యత కేవలం హీరో, నిర్మాతలదే.. కాదు హీరోయిన్ల ది కూడా. ఈ విషయంలో నిధి నిర్మాతలకు మంచి సపోర్టుగా నిలుస్తోంది. ఇకనైనా నీ యాటిట్యూడ్ ని పక్కన పెట్టి నీ పంథా మార్చుకో అంటూ నెటిజన్స్ నయన్ కు క్లాసు పీకుతున్నారు.
Also Read: Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు ‘బాహుబలి’ కాపీనా?.. ఆ 20 నిమిషాలు సేమ్ టూ సేమ్