Fish Venkat: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat)ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఆది సినిమా ద్వారా ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమైన ఈయన సుమారు వందకు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కొన్ని సినిమాలలో కమెడియన్ గాను, విలన్ పాత్రలలోను నటించిన ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత నాలుగు రోజుల క్రితం మరణించారు. అయితే ఈయన రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ (Kidney Failure)అవ్వడంతోనే మరణించారని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీశారు.
అద్భుతమైన సందేశం…
ఇటీవల ఈయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిన నేపథ్యంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఫిష్ వెంకట్ మరణించడంతో ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా ఫిష్ వెంకట్ చివరి రోజుల్లో ఎంతో సందేశాత్మకమైన మాటలు చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యువత గుట్కా (Gutka)తీసుకోవడం గురించి కూడా ఈయన అందరిలో అవగాహన కల్పించినట్టు తెలుస్తుంది.
రోజుకు 40 ప్యాకెట్ల గుట్కా…
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ మాట్లాడుతూ… “తనకు గతంలో పెద్ద ఎత్తున గుట్కా తీసుకునే అలవాటు ఉండేదని తెలిపారు. రోజుకు 30 నుంచి 40 గుట్కా ప్యాకెట్లు నమిలే వాడిని. పాన్ మసాలా(Pan Masala) కూడా వేసుకునే వాడిని ఇలా వీటిని తీసుకోవడం వల్ల మాట కూడా స్పష్టంగా వచ్చేది కాదని ఫిష్ వెంకట్ తెలియచేశారు. గుట్కా అధికంగా తీసుకోవడం వల్ల మాట తీరు కూడా స్పష్టంగా లేదని డాక్టర్లు తెలియచేయడంతో డాక్టర్ల సూచనల ప్రకారమే తాను గుట్కా వాడటం పూర్తిగా మానుకున్నానని వెల్లడించారు. గుట్కా తీసుకోవడం మానుకున్న తర్వతనే నా ఆరోగ్యం కూడా మెరుగుపడిందని తెలిపారు”. ఇలా ఫిష్ వెంకట్ తాను చేసిన తప్పు గురించి అందరికీ తెలియజేస్తూ ఇలాంటి పొరపాట్లు ఎవరు చేయొద్దని అందరికీ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు..
ఇండస్ట్రీకి దూరం…
ఇలా గుట్కా గురించి అద్భుతమైన మాటలు అందరికీ తెలియజేసిన కొద్ది రోజులకే అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఈ అనారోగ్య సమస్యల కారణంగా సినిమా ఇండస్ట్రీకి కూడా ఫిష్ వెంకట్ దూరంగా ఉన్నారు. ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఎన్నో ఆర్దిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తనని వెంటాడటంతో సరైన చికిత్స తీసుకోలేక ఫిష్ వెంకట్ మరణించారని తెలుస్తోంది. ఇక ఈయన హాస్పిటల్ లో ఉన్నప్పుడు తనకు ఎవరైనా సహాయం చేయాలి అంటూ తన కుటుంబ సభ్యులు వేడుకున్నారు కానీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన మాత్రం లభించలేదు అయితే ఫిష్ వెంకట్ కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని, మా అసోసియేషన్ లో సభ్యత్వం కూడా లేదని అందుకే ఇండస్ట్రీ పెద్దగా స్పందించలేదనీ పలువురు నిర్మాతలు ఈయన మరణం పై సినీ సెలబ్రిటీలు స్పందించకపోవడం గురించి అలాగే ఇండస్ట్రీ సహాయం చేయకపోవడం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.
Also Read: Kajol -Twinkle : టూ మచ్ అంటోన్న కాజల్ .. ట్వింకిల్… సరికొత్త షో ప్రారంభం?